కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ ఢిల్లీలోని రాజ్‌ఘాట్ ప్రాంతంలో నిర్వహించిన సత్యాగ్రహ ధర్నా కార్యక్రమంలో పాల్గొని పౌరసత్వ చట్టంపై మాట్లాడనున్నారు. దేశంలోని స్టూడెంట్స్, యువతకు ట్విట్టర్ ద్వారా ఉద్దేశాన్ని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీలతో పాటు ఇతర సీనియర్ నేతల సమక్షంలో సత్యాగ్రహ ధర్నా కార్యక్రమం జరగనుంది.
ఈ మేరకు రాహుల్ గాంధీ ఇలా ట్వీట్ చేశారు. ‘భారతదేశానికి చెందిన స్టూడెంట్స్, యూత్‌కు ఇదే చెప్తున్నా. మనం భారతీయులం అనుకుంటే సరిపోదు. ఇటువంటి క్లిష్ట సమయంలోనే మనం భారతీయులమని చాటి చెప్పాలి. మనల్ని ద్వేషిస్తూ భారతదేశాన్ని పాడు చేయాలని చూస్తున్న వారిని అనుమతించకూడదు. ఈ రోజు మధ్యాహ్నం 3గంటలకు రాజ్ ఘాట్ ప్రాంతంలో జరిగే సత్యాగ్రహ ధర్నా కార్యక్రమంలో నాతో కలవండి. భారత్‌లో ద్వేషం, అహింసలు పుట్టిస్తున్న మోడీ, షాలపై జరగే ఆందోళనకు మీరంతా రండి’ అని పిలుపునిచ్చారు.
Dear Students & Youth of ??,
It’s not good enough just to feel ??. At times like these it’s critical to show that you’re ?? & won’t allow ?? to be destroyed by hatred.
Join me today at 3 PM at Raj Ghat, to protest against the hate & violence unleashed on India by Modi-Shah.
— Rahul Gandhi (@RahulGandhi) December 23, 2019
ఈ కార్యక్రమం గురించి కాంగ్రెస్ శ్రేణులు శనివారం నుంచే ప్రచారం చేపట్టింది. డిసెంబరు 23న మధ్యాహ్నం 3గంటల నుంచి రాత్రి 8గంటల వరకూ జరగనున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ సీనియర్ శ్రేణులు పిలుపునిచ్చారు. నియంతృత్వ పాలనను ఎదుర్కొని బాబా సాహెబ్ తాయరుచేసిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందామంటూ చెప్పుకొస్తున్నారు.
ఆదివారం బీజేపీ కృతజ్ఞత సభలో పాల్గొని మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ..
పౌరసత్వం చట్టం విషయంలో ఢిల్లీలో ప్రజలను రెచ్చగొట్టి కొంతమంది వేడుక చూస్తున్నారనీ.. వారి ఆటలు సాగనివ్వమని అన్నారు. ఇటువంటి చర్యలతో భారతదేశంపు ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్రపన్నుతున్నారన్నారు. అటువంటివారి మాటలు నమ్మవద్దని.. ప్రధాని మోడీ బీజేపీ కృతజ్ఞత సభ వేదికగా సూచించారు.