By Polls in States: బీజేపీకి వ్యతిరేక పవనాలు: పలు రాష్ట్రాల ఉపఎన్నికల్లో బీజేపీయేతర పార్టీల అభ్యర్థుల గెలుపు

నాలుగు అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించారు. శనివారం వెలువడిన ఆయా ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, టీఎంసీ, ఆర్జేడీ అభ్యర్థులు గెలుపొందారు

By Polls in States: ఇటీవల నిర్వహించిన ఐదు రాష్ట్రాల ఉపఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అభివృద్ధే మంత్రంగా ఆయా రాష్ట్రాల్లో బీజేపీ చేసిన ప్రచారం..తిరిగి అధికారాన్ని కట్టబెట్టిందంటూ రాజకీయ విశ్లేషకులు చెప్పుకొచ్చారు. అయితే తాజాగా నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికల ఫలితాలు అందుకు బిన్నంగా ఉన్నాయి. ఒక లోక్‌సభ స్థానం సహా..పశ్చిమబెంగాల్, చత్తీశ్గఢ్, మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించారు. శనివారం వెలువడిన ఆయా ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, టీఎంసీ, ఆర్జేడీ అభ్యర్థులు గెలుపొందారు. పశ్చిమబెంగాల్ లోని అసన్సోల్ లోక్‌సభ స్థానంలో టీఎంసీ అభ్యర్థి శత్రుజ్ఞ సిన్హా గెలుపొందారు. ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి అగ్నిమిత్ర పాల్ మీద భారీ మెజారిటీతో గెలుపొందిన శత్రుజ్ఞ సిన్హా..అసన్సోల్ లోక్‌సభ స్థానం నుంచి టీఎంసీకి మొదటి విజయాన్ని అందించారు.

Also read:India Wheat to Egypt: భారత్ నుంచి గోధుమలు దిగుమతికి ఈజిప్టు పచ్చ జెండా: 30 లక్షల టన్నుల ఎగుమతే లక్ష్యం

ఇక పశ్చిమబెంగాల్ లోని బాలిగంజ్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో తృణమూల్‌ అభ్యర్థి బాబుల్ సుప్రియో విజయం సాధించారు. ఈయన బీజేపీ నుండి తృణమూల్ కి మారిన సంగతి తెలిసిందే. మరోవైపు బీహార్ లోని బోచాహన్ అసెంబ్లీ నియోజకవర్గానికి(ఎస్సి స్థానం) జరిగిన ఉప ఎన్నికలో ఆర్జేడీ అభ్యర్థి 36,000 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి రెండో స్థానంలో నిలిచారు. ఇక మహారాష్ట్రలోని కొల్హాపూర్ ఉత్తర నియోజకవర్గానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి జయశ్రీ జాదవ్ విజయం సాధించారు. అధికార శివసేనకు ఆయువుపట్టుగా చెప్పుకునే ఈ స్థానంలో..2019లో కాంగ్రెస్ తరుపున ప్రముఖ వ్యాపారవేత్త చంద్రకాంత్ జాదవ్ బరిలో నిలిచి విజయంసాధించారు.

Also read:Prashant Kishor : సోనియాగాంధీతో ప్రశాంత్ కిషోర్ అత్యవసర భేటీ.. కాంగ్రెస్‌లో చేరాలని ఆహ్వానం!

అయితే కరోనా తాలూకు దుష్ప్రబావాలతో చంద్రకాంత్ జాదవ్ మృతి చెందగా,.. కొల్హాపూర్ ఉత్తర నియోజకవర్గం ఖాళీ అయింది. ఏప్రిల్ 12న జరిగిన ఉపఎన్నికలో దివంగత ఎమ్మెల్యే చంద్రకాంత్ జాదవ్ భార్య జయశ్రీ జాదవ్ గెలుపొందారు. ఇక్కడ శివసేన, బీజేపీ అభ్యర్థులు వరుసగా రెండు మూడూ స్థానాల్లో నిలిచారు. చత్తీశ్గఢ్ లోని ఖైరాగఢ్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో అధికార కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో కొనసాగుతున్నారు. జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ (జె) ఎమ్మెల్యే దేవవ్రత్ సింగ్ అనారోగ్య కారణాలతో గత నవంబర్ లో మృతి చెందిన అనంతరం ఇక్కడి స్తానం ఖాళీ అయింది. దీంతో ఖైరాగఢ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక నిర్వహించారు.

Also read:Rahul Gandhi Tour: రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన తేదీ ఖరారు: మే 6న వరంగల్‌లో భారీ బహిరంగ సభ

ట్రెండింగ్ వార్తలు