India Wheat to Egypt: భారత్ నుంచి గోధుమలు దిగుమతికి ఈజిప్టు పచ్చ జెండా: 30 లక్షల టన్నుల ఎగుమతే లక్ష్యం

గోధుమల ఎగుమతుల్లో పైచేయి సాధించాలన్న భారత ప్రభుత్వ లక్ష్యానికి ఊతమిచ్చేలా..భారత్ గోధుమలను దిగుమతి చేసుకునేందుకు ఈజిప్టు అంగీకారం తెలుపడం రైతులకు కలిసొచ్చే అంశం

India Wheat to Egypt: భారత్ నుంచి గోధుమలు దిగుమతికి ఈజిప్టు పచ్చ జెండా: 30 లక్షల టన్నుల ఎగుమతే లక్ష్యం

Wheat

India Wheat to Egypt: భారత్ నుంచి గోధుమలు దిగుమతికి ఈజిప్టు ప్రభుత్వం అంగీకారం తెలిపినట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ వెల్లడించారు. గోధుమల ఎగుమతుల్లో పైచేయి సాధించాలన్న భారత ప్రభుత్వ లక్ష్యానికి ఊతమిచ్చేలా..భారత్ గోధుమలను దిగుమతి చేసుకునేందుకు ఈజిప్టు అంగీకారం తెలుపడం..రైతులకు కలిసొచ్చే అంశమని పీయూష్ గోయెల్ అన్నారు. ఇప్పటి వరకు రష్యా, యుక్రెయిన్ సహా పలు ఎంపిక చేసిన దేశాల నుంచే గోధుమలను దిగుమతి చేసుకుంటుంది ఈజిప్టు ప్రభుత్వం. అధికారిక లెక్కల ప్రకారం ఒక్క 2021 సంవత్సరంలోనే $20 కోట్ల డాలర్ల విలువైన 61 లక్షల టన్నుల గోధుమలను రష్యా యుక్రెయిన్ నుంచి దిగుమతి చేసుకుంది ఈజిప్టు. ఈజిప్టు దిగుమతుల్లో ఇది 80 శాతంగా ఉండగా..మిగిలిన 20 శాతం గోధుమలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది.

Also read:Russia Bans Boris Johnson : రష్యా ప్రతిచర్య.. బ్రిటన్ ప్రధానిపై నిషేధం

అయితే ఇటీవల దుబాయ్ లో పర్యటించిన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, అక్కడ ఈజిప్టు దేశపు ప్రణాళిక, ఆర్థికాభివృద్ధి మంత్రి డాక్టర్ హలా ఎల్-సెయిడ్ తో సమావేశం అయ్యారు. ఈసందర్భంగా యుక్రెయిన్ రష్యా యుద్ధం గురించి, యుద్ధం కారణంగా గోధుమల దిగుమతికి ఆటంకం కలగడంపై ఇరువురు చర్చించారు. గోధుమలు సరఫరా చేసేందుకు భారత్ సిద్ధంగా వుందటూ పీయూష్ గోయెల్ సంసిద్ధత వ్యక్తం చేశారు. అనంతరం ఈజిప్టు నుంచి వచ్చిన వ్యవసాయశాఖ అధికారులు భారత్ లోని గోధుమ సేకరణ కేంద్రాలను సందర్శించడంతో పాటు..మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పంజాబ్ నుంచి గోధుమల తరలింపుకు అవసరమైన మౌలిక సదుపాయాలను, రవాణా సౌకర్యాలను పరిశీలించారు.

Also read:Corona 4th wave: కొత్తగా కోవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయిన చిన్నారుల్లో సహసంబంధ వ్యాధులు

ఈజిప్టుకు గోధుమలు ఎగుమతులపై..భారత అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ (APEDA) చైర్మన్ ఎం.అంగముత్తు స్పందిస్తూ..”2022-23 మధ్య భారత్ నుంచి 10 మిలియన్ టన్నుల గోధుమలు ఎగుమతి లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ ఆర్ధిక సంవత్సరానికి గానూ ఈజిప్టుకి 30 లక్షల టన్నుల గోధుమలు ఎగుమతి చేయడం సంతోషమని” అన్నారు. రష్యా యుక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆహార, ధాన్యం కొరత ఏర్పడిందని..భారత్ ఈ భర్తీని అందిపుచ్చుకుంటే..త్వరలోనే ఆహార ఎగుమతుల్లో భారత్ అగ్రస్థానం చేరుతుందని వాణిజ్య విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం భారత్ గోధుమల ఎగుమతుల్లో అగ్రభాగం బంగ్లాదేశ్ కె వెళ్తున్నాయి.

Also read:PM Modi: ప్రపంచమే ఇప్పుడు ‘ఆత్మనిర్భర్’గా ఎలా మారాలని ఆలోచిస్తోంది: ప్రధాని మోదీ