Russia Bans Boris Johnson : రష్యా ప్రతిచర్య.. బ్రిటన్ ప్రధానిపై నిషేధం

తనపై అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆంక్షలు విధించిన నేపథ్యంలో, రష్యా కూడా ప్రతిచర్యకు దిగింది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పై(Russia Bans Boris Johnson)

Russia Bans Boris Johnson : రష్యా ప్రతిచర్య.. బ్రిటన్ ప్రధానిపై నిషేధం

Russia Bans Boris Johnson

Russia Bans Boris Johnson : సైనిక చర్య పేరుతో యుక్రెయిన్ పై రష్యా సేనలు బాంబులు, క్షిపణులతో దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, రష్యా దురాక్రమణను ప్రపంచ దేశాలు తప్పుపడుతున్నాయి. రష్యాని కట్టడి చేసేందుకు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. అయినా, తగ్గేదేలే అన్నట్టుగా పుతిన్ వ్యవహరిస్తున్నారు. లక్ష్యాన్ని సాధించే వరకు యుద్ధం ఆగదని ప్రకటించారు. అంతేకాదు.. ప్రపంచ దేశాలు విధిస్తున్న ఆంక్షలను రష్యా సీరియస్ గా తీసుకుంది. తనపై అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆంక్షలు విధించిన నేపథ్యంలో, రష్యా కూడా ప్రతిచర్యకు దిగింది. ఇప్పటికే పలువురు అంతర్జాతీయ నేతలు రష్యాలో ప్రవేశించకుండా నిషేధించిన పుతిన్ ప్రభుత్వం… తాజాగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పైనా నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది.

అంతేకాదు, రష్యాలో ప్రవేశించకుండా బ్రిటన్ విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్, అనేకమంది కేబినెట్ మంత్రులపైనా నిషేధాజ్ఞలు విధించింది. ఈ మేరకు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన చేసింది. మొత్తంగా ప్రధాని బోరిస్ జాన్సన్ సహా 13 మంది బ్రిటన్ ప్రముఖులను నిషేధిత నేతల జాబితాలో చేర్చింది. వారిలో బ్రిటన్ మాజీ ప్రధాని థెరిస్సా మే కూడా ఉన్నారు. అంతేకాదు, భవిష్యత్తులో ఈ జాబితాను మరింత విస్తరిస్తామని కూడా రష్యా హెచ్చరించింది.(Russia Bans Boris Johnson)

Russia Defence Minister Sergei : రష్యా రక్షణ మంత్రికి గుండెపోటు? కారణం అదేనా?

యుక్రెయిన్ పై రష్యా దురాక్రమణకు దిగిన నేపథ్యంలో, రష్యాను ఏకాకిని చేసేందుకు పాశ్చాత్య దేశాలు కఠిన ఆంక్షలకు తెరలేపాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఆయన కుటుంబ సభ్యులపై అనేక దేశాలు నిషేధం విధించాయి. పుతిన్ కుటుంబ ఆస్తులతో పాటు, విదేశాల్లోని రష్యన్ కుబేరుల ఆస్తులపైనా, రష్యా కంపెనీలపైనా కఠిన ఆంక్షలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో రష్యా కూడా పలు దేశాల ప్రముఖులను నిషేధిస్తోంది.

ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యకు దిగిన విషయం తెలిసిందే. తొలుత ఉక్రెయిన్‌ సైనిక స్థావరాలే లక్ష్యంగా చేసుకున్నామని చెప్పిన మాస్కో.. ఆ తర్వాత సాధారణ జనావాసాలపైనా విరుచుకుపడింది. నానాటికీ ఈ యుద్ధం తీవ్రరూపం దాల్చడమే గాక, వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాల్లో ఒకటైన మరియుపోల్‌లో 10వేల మంది మరణించినట్లు సమాచారం.(Russia Bans Boris Johnson)

మరోవైపు రష్యా దాడులను ఉక్రెయిన్‌ సేనలు గట్టిగా ప్రతిఘటిస్తున్నాయి. శత్రువులు ఆధీనంలోకి తీసుకున్న ప్రాంతాలను ఒక్కొక్కటిగా విడిపించుకుంటున్నాయి. ఈ యుద్ధంలో రష్యాకు భారీ నష్టమే జరుగుతోంది. రష్యా పెద్ద సంఖ్యలో తన సైనికులను కోల్పోతోంది.

Russia and ukraine war: రష్యాకు మరో ఎదురు దెబ్బ.. ఐరాసలో నాలుగు కమిటీల్లో ఓటమి

శత్రువులకు ఏ మాత్రం వెరవకుండా పోరాటం చేస్తోన్న ఉక్రెయిన్‌ వాసుల ధైర్యాన్ని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ కొనియాడారు. యుద్ధాన్ని అడ్డుకునే ధైర్యం తమకు ఉందని, అయితే అందుకు అవసరమైన ఆయుధాలు ఇవ్వాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు జెలెన్ స్కీ. ‘‘ఉక్రెయిన్‌ను లొంగదీసుకునేందుకు 5 రోజులు చాలని దురాక్రమణదారులు భావించారు. కానీ, మా దేశ ప్రజలు తమ జీవితంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అదే పోరాటం. గత 50 రోజులుగా మేం పోరాడుతూనే ఉన్నాం. ఇందుకు చాలా గర్వంగా ఉంది” అని జెలెన్ స్కీ అన్నారు.