Russia Defence Minister Sergei : రష్యా రక్షణ మంత్రికి గుండెపోటు? కారణం అదేనా?

యుక్రెయిన్ తో యుద్ధం వేళ.. ర‌ష్యా ర‌క్ష‌ణ మంత్రి సెర్గీ షోయిగు గురించి మరో వార్త సంచలనంగా మారింది. రక్షణమంత్రికి గుండెపోటు..(Russia Defence Minister Sergei)

Russia Defence Minister Sergei : రష్యా రక్షణ మంత్రికి గుండెపోటు? కారణం అదేనా?

Russia Defence Minister Sergei

Russia Defence Minister Sergei : యుక్రెయిన్ తో యుద్ధం వేళ.. ర‌ష్యా ర‌క్ష‌ణ మంత్రి సెర్గీ షోయిగు గురించి మరో వార్త సంచలనంగా మారింది. ఆయనకు గుండెపోటుకు వచ్చిందనే వార్తలు వస్తున్నాయి. యుక్రెయిన్ పై దాడి ప్రారంభమైన తర్వాత దాదాపు 20 మంది రష్యన్ జనరళ్లు అరెస్ట్ అయ్యారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో… రక్షణమంత్రికి గుండెపోటు అనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

యక్రెయిన్ పై దాడి విషయంలో రష్యా దారుణంగా వైఫల్యం చెందుతోందంటూ వార్తలు రావడం మొదలైనప్పటి నుంచి రక్షణమంత్రి పెద్దగా బయట కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఆయన గుండెపోటుకు గురయ్యారని రష్యన్-ఇజ్రాయెల్ వ్యాపారవేత్త లియనిడ్ నెవ్ జిలిన్ సంచలన ప్రకటన చేశారు. అంతేకాదు ఈ గుండెపోటు సహజంగా వచ్చింది కాదని చెప్పారు. సైనిక చర్య విషయంలో అధ్యక్షుడు పుతిన్ కు, రక్షణ అధికారులకు మధ్య విభేదాలు ఉన్నాయనే అనుమానాలను కూడా ఆయన వ్యక్తం చేశారు. కాగా, సెర్గీకి గుండెపోటు.. యుక్రెయిన్‌లో వైఫల్యాల ఫలితమే అని పుతిన్‌ విమర్శకులు అంటున్నారు.(Russia Defence Minister Sergei)

Russia and ukraine war: రష్యాకు మరో ఎదురు దెబ్బ.. ఐరాసలో నాలుగు కమిటీల్లో ఓటమి

యుక్రెయిన్‌ సైనిక చర్యలో భాగంగా రష్యా భారీ నష్టాన్ని చూస్తోందని అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే 20వేలకు పైగా సైనికులను కోల్పోవడంతోపాటు భారీ స్థాయిలో యుద్ధ సామగ్రిని రష్యా నష్టపోతున్నట్లు తెలుస్తోంది. ఇలా యుక్రెయిన్‌లో రష్యా దారుణ వైఫల్యం చెందుతోందని వార్తలు మొదలైనప్పటి నుంచి రక్షణశాఖ మంత్రి సెర్గీ షోయిగు అంతగా బయటకు కనిపించలేదు. అధికారిక మీడియా ప్రకటనలకూ దూరంగా ఉన్నారు. ఇలా యుక్రెయిన్‌లో ప్రతికూల ఫలితాల నేపథ్యంలో ఆయన తీవ్ర గుండెపోటు బారినపడ్డారని వ్యాపారి లియనిడ్‌ సంచలన ప్రకటన చేశారు. అంతేకాదు అది సహజంగా వచ్చినట్లు కనిపించడం లేదని ఆయన ఆరోపించడం చర్చకు దారితీసింది. యుక్రెయిన్‌ సైనిక చర్య విషయంలో పుతిన్‌కు రక్షణశాఖ అధికారులకు మధ్య విభేదాలను ప్రస్తావిస్తూ ఆయన అనుమానం వ్యక్తం చేశారు. షోయిగు, పుతిన్‌ మధ్య విభేదాలు వచ్చాయంటూ అమెరికా ఇంటెలిజెన్స్‌ కూడా అనుమానాలు వ్యక్తం చేసిన తరుణంలో రష్యన్‌-ఇజ్రాయెల్‌ వ్యాపారవేత్త చేసిన తాజా ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.

మరోవైపు యుక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలై 50 రోజులు అయిన సందర్భంగా జెలెన్‌స్కీ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. శత్రువులకు ఏ మాత్రం వెరవకుండా పోరాటం చేస్తున్న యుక్రెయిన్‌ వాసుల ధైర్యాన్ని కొనియాడారు. యుద్ధాన్ని అడ్డుకునే ధైర్యం తమకు ఉందని, అయితే అందుకు అవసరమైన ఆయుధాలు ఇవ్వాలని ప్రపంచ దేశాలకు మరోసారి విజ్ఞప్తి చేశారు జెలెన్ స్కీ. ”యుక్రెయిన్‌ను లొంగదీసుకునేందుకు 5 రోజులు చాలని దురాక్రమణదారులు భావించారు. కానీ, మా దేశ ప్రజలు తమ జీవితంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అదే పోరాటం. గత 50 రోజులుగా మేం పోరాడుతూనే ఉన్నాం. ఇందుకు చాలా గర్వంగా ఉంది” అని జెలెన్ స్కీ అన్నారు.(Russia Defence Minister Sergei)

India – Russia: యుద్ధ సంక్షోభంలోనూ భారత్ కు సైనిక సామాగ్రి పంపిణీ చేసిన రష్యా

ఈ ఏడాది ఫిబ్రవరి 24న యుక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యకు దిగింది. తొలుత యుక్రెయిన్‌ సైనిక స్థావరాలే లక్ష్యంగా చేసుకున్నామని చెప్పిన మాస్కో.. ఆ తర్వాత సాధారణ జనావాసాలపైనా విరుచుకుపడింది. బాంబులు, మిస్సైళ్ల వర్షం కురిపించింది. నానాటికీ ఈ యుద్ధం తీవ్రరూపం దాల్చడమే గాక, వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. యుక్రెయిన్‌లోని ప్రధాన నగరాల్లో ఒకటైన మరియుపోల్‌లో ఇప్పటివరకు 10వేల మంది మరణించినట్లు సమాచారం.