India – Russia: యుద్ధ సంక్షోభంలోనూ భారత్ కు సైనిక సామాగ్రి పంపిణీ చేసిన రష్యా

రష్యా గతంలో భారత్ తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు S-400 క్షిపణి వ్యవస్థను ఇటీవల లాంఛనంగా అప్పగించినట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి

India – Russia: యుద్ధ సంక్షోభంలోనూ భారత్ కు సైనిక సామాగ్రి పంపిణీ చేసిన రష్యా

Russia

India – Russia: ఓ పక్క యుక్రెయిన్ ను వశపరుచుకోవాలనే లక్ష్యం, మరో పక్క పశ్చిమ దేశాల ఆంక్షలు..వెరసి రష్యాపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. యుక్రెయిన్ తో యుద్ధం కారణంగా యూరోప్, అమెరికా దేశాలు రష్యాపై విధించిన ఆంక్షల కారణంగా ఆదేశ ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలం అయింది. రష్యా నుంచి ఎగుమతులు దిగుమతులు నిలిపివేశాయి కొన్ని దేశాలు. మిత్ర పక్షం చైనా సైతం రష్యాకు పంపిణీ చేయాల్సిన విమాన సామాగ్రిని నిలిపివేసింది. అయితే ఇవేవి తమపై పెద్దగా ప్రభావం చూపలేదన్న చందంగా రష్యా తన మిత్రపక్షాలతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే ఉంది. రష్యా గతంలో భారత్ తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు S-400 క్షిపణి వ్యవస్థను ఇటీవల లాంఛనంగా అప్పగించినట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి.

Also read:Russia Ukraine War: రష్యా యుద్ధ నౌకను ధ్వంసం చేసిన యుక్రెయిన్.. కీలక ప్రకటన చేసిన రష్యా..

యుక్రెయిన్ తో రష్యా యుద్ధం కొనసాగుతున్నప్పటికీ..ఆదేశం నుంచి భారత్ కు చేరాల్సిన సైనిక సామగ్రి పంపిణీలో ఎటువంటి జాప్యం లేదని..తాజాగా రష్యా నుంచి వచ్చిన S-400 క్షిపణి వ్యవస్థ సహా ఎప్పటికప్పుడు సైనిక సామాగ్రిని రష్యా అందిస్తూనే ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీన్ని బట్టి చూస్తేనే అర్ధం అవుతుంది..రష్యా భారత్ కు ఇస్తున్న ప్రాధాన్యం ఏమిటో అని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. S-400 క్షిపణి వ్యవస్థను సముద్ర మార్గాన ఓడ ద్వారా పంపిణీ చేసింది రష్యా. క్షిపణి వ్యవస్థ యొక్క ఇతర భాగాలను వాయు, సముద్ర మార్గాల ద్వారా పంపించింది. వచ్చిన సామాగ్రిని వెంటనే నిర్ణిత కేంద్రాలకు తరలించారు రక్షణశాఖ అధికారులు.

Also read:3 Army Personnel : కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఆర్మీ వాహనం బోల్తా పడి 3 సైనికులు మృతి, ఐదుగురికి గాయాలు

రష్యా యుక్రెయిన్ మధ్య గత 48 రోజులకు పైగా యుద్ధం కొనసాగుతోంది. ఈనేపధ్యంలో రష్యా నుంచి భారత్ కు అందాల్సిన సైనిక సామగ్రి సరఫరాపై భారత రక్షణశాఖ కాస్త ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం భారత సైన్యానికి సరిపడా ఆయుధ విడిభాగాలు మరియు సైనిక సామగ్రి నిల్వ ఉన్నప్పటికీ, పశ్చిమ దేశాలు రష్యాపై విధించిన ఆర్ధిక ఆంక్షల కారణంగా భవిష్యత్ అవసరాలపై ప్రభావం ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Also read:Vladimir Putin: రష్యా గ్యాస్ సరఫరాను నిలిపివేస్తామన్న యూరోప్ దేశాలకు పుతిన్ స్వీట్ వార్నింగ్