Russia Ukraine War: రష్యా యుద్ధ నౌకను ధ్వంసం చేసిన యుక్రెయిన్.. కీలక ప్రకటన చేసిన రష్యా..

రష్యా, యుక్రెయిన్ మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. రష్యా సైనికులు యుక్రెయిన్ పై బాంబుల మోతమోగిస్తూనే ఉన్నారు. ప్రపంచ దేశాలు రష్యా తీరును ఖండిస్తున్నప్పటికీ పుతిన్ సేన వెనక్కు తగ్గడం...

Russia Ukraine War: రష్యా యుద్ధ నౌకను ధ్వంసం చేసిన యుక్రెయిన్.. కీలక ప్రకటన చేసిన రష్యా..

Russian 1

Russia Ukraine War:  రష్యా, యుక్రెయిన్ మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. రష్యా సైనికులు యుక్రెయిన్ పై బాంబుల మోతమోగిస్తూనే ఉన్నారు. ప్రపంచ దేశాలు రష్యా తీరును ఖండిస్తున్నప్పటికీ పుతిన్ సేన వెనక్కు తగ్గడం లేదు. రష్యాను ఆర్థికంగా ఇబ్బందులు పెట్టేందుకు అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నప్పటికీ ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ యుక్రెయిన్ లోని తమ దళాలను వెనక్కు పిలవడం లేదు. అయితే తాజాగా యుక్రెయిన్ పై విరుచుకుపడుతున్న రష్యాకు గట్టిషాక్ తగిలింది. యుక్రెయిన్ సైన్య రష్యా యుద్ధ నౌకపై గురువారం తెల్లవారు జామున మెరుపుదాడికి పాల్పడ్డాయి. నల్ల సముద్రంలోని రష్యా యుద్ధ నౌకపై యుక్రెయిన్ సైన్యం క్షిపణిదాడి చేసినట్టు ఒడెస్సా గవర్నర్ ప్రకటించారు.

Russia Ukraine War : రష్యాకు షాకిచ్చిన ఆస్ట్రేలియా.. 14 రష్యన్ కంపెనీలపై ఆంక్షలు..

మేరియుపోల్, ఒడెస్సా వంటి తీర ప్రాంత నగరాలను లక్ష్యంగా చేసుకుంటోన్న రష్యా సేనలు దాడులకు యుద్ధ నౌకలను వినియోగిస్తున్నాయి. ఈ క్రమంలో యుక్రెయిన్ తీర ప్రాంతానికి రష్యాకు చెందిన మస్క్యా క్రూజ్ చేరుకోగానే దానిపై క్షిపణితో దాడికి పాల్పడినట్లు ఒడెస్సా గవర్నర్ ప్రకటించారు. అయితే దీనిపై యుక్రెయిన్ రక్షణ శాఖ మాత్రం అధికారిక ప్రకటన చేయలేదు. ఇదే సమయంలో నౌక దెబ్బతిన్నట్లు రష్యా అధికారులు ధృవీకరించారు. అయితే నౌక ధ్వంసమైంది యుక్రెయిన్ దళాల క్షిపణి వల్ల కాదని, యుద్ధ నౌకలో మందుగుండు సామాగ్రి పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. సిబ్బందిని మాత్రం సురక్షితంగా బయటపడినట్లు వెల్లడించింది.

Russia Ukraine war: రష్యా కౄరత్వానికి హద్దులు లేకుండా పోయింది: యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ

క్షిపణులను ప్రయోగించే సామర్థ్యమున్న ఈ నౌకను 1980ల్లో తయారు చేశారు. మొదట దీని పేరు స్లావా అయితే దీని మోస్క్వాగా పేరు మార్చారు. దీనిలో పీ-1000 వుల్కాన్ క్షిపణలు ఉన్నాయి. సిరియాలో సైనిక చర్యలకు ఈ నౌకను ఉపయోగించారు.