Vladimir Putin: రష్యా గ్యాస్ సరఫరాను నిలిపివేస్తామన్న యూరోప్ దేశాలకు పుతిన్ స్వీట్ వార్నింగ్

గ్యాస్ దిగుమతులను నిలిపివేయడానికి పాశ్చాత్య దేశాలు చేస్తున్న ప్రయత్నాలతో..వారి ఆర్థిక వ్యవస్థలపైనే ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని పుతిన్ హెచ్చరించారు.

Vladimir Putin: రష్యా గ్యాస్ సరఫరాను నిలిపివేస్తామన్న యూరోప్ దేశాలకు పుతిన్ స్వీట్ వార్నింగ్

Russia

Vladimir Putin: యుక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రష్యాపై యూరోప్, అమెరికా దేశాలు ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. రష్యాతో తమకున్న వాణిజ్య పరమైన సంబంధాలను తెగతెంపులు చేసుకుంటున్నాయి పలు దేశాలు. యుక్రెయిన్ నుంచి రష్యా నిష్క్రమించాలంటూ యూరోప్ లోని కొన్ని దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. విదేశీ సంస్థలు ఇప్పటికే రష్యాలో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు నిలిపివేయగా..రష్యా ప్రభుత్వ సంస్థలతో ఉన్న ఇతర దేశాల కంపెనీలు సైతం బయటకు వచ్చేశాయి. ఇదిలాఉంటే రష్యా నుంచి గ్యాస్ దిగుమతులను నిలిపివేస్తామంటూ యూరోప్ దేశాలు రష్యాను హెచ్చరించడంపై ఆదేశాధ్యక్షుడు పుతిన్ స్పందించారు.

Also read:FIH Odisha Hockey : హాకీ పురుషుల ప్రపంచ కప్ అధికారిక లోగో ఆవిష్కరణ..

తమ దేశం నుంచి దశలవారీగా గ్యాస్ దిగుమతులను నిలిపివేయడానికి పాశ్చాత్య దేశాలు చేస్తున్న ప్రయత్నాలతో..వారి ఆర్థిక వ్యవస్థలపైనే ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని పుతిన్ హెచ్చరించారు. గురువారం పుతిన్ మాట్లాడుతూ రష్యా గ్యాస్ దిగుమతులపై ఆధారపడ్డ యూరోపియన్ దేశాలు ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయాల వైపు చూడడం వారికి నష్టం కలిగిస్తుందని అన్నారు. ఇప్పుడు యూరప్ లో దానికి సహేతుకమైన స్థాన౦ లేదని ఆయన చెప్పుకొచ్చారు. వారు ఈ విధానాల వైపు మళ్లడం చాలా బాధాకరంమని అన్నారు.

Also read:Kerala Woman: కేరళ మహిళకు ఉరిశిక్ష విధించిన యెమెన్ కోర్టు: క్షమాబిక్ష పెట్టాలంటూ కుటుంబ సభ్యుల వేడుకోలు

ఐరోపాకు ఇతర దేశాల నుండి, ప్రధానంగా అమెరికా నుండి దిగుమతులు పెరిగితే, ఆప్రభావం యూరోప్ దేశాలపై పడుతుందని, దేశంలో ధరలు పెరిగి ప్రజలపై పెను భారం పడుతుందని పుతిన్ పేర్కొన్నారు. ఇది “ప్రజల జీవన ప్రమాణాన్ని మరియు యూరోపియన్ ఆర్థిక వ్యవస్థ యొక్క పోటీతత్వాన్ని” తీవ్రంగా ప్రభావితం చేస్తుందిని ఆయన అన్నారు. యూరోపియన్ యూనియన్ దేశాలు తమకు అవసరమైన 40 శాతం సహజ వాయువును మరియు 25 శాతం చమురు అవసరాల కోసం రష్యాపై ఆధారపడ్డాయి.

Also read:Litre Petrol for Re. 1: రూపాయికే లీటర్ పెట్రోల్ పంపిణీ: ఎగబడిన వాహనదారులు