FIH Odisha Hockey : హాకీ పురుషుల ప్రపంచ కప్ అధికారిక లోగో ఆవిష్కరణ..

FIH Odisha Hockey : 15వ ఎడిషిన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ హాకీ (FIH) పురుషుల ప్రపంచ కప్ అధికారిక లోగోను ఒడిశా రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ ఆవిష్కరించారు.

FIH Odisha Hockey : హాకీ పురుషుల ప్రపంచ కప్ అధికారిక లోగో ఆవిష్కరణ..

Official Logo Of Fih Odisha Hockey Men’s World Cup 2023 Unveiled By Cm Naveen Patnaik

FIH Odisha Hockey : 15వ ఎడిషిన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ హాకీ (FIH) పురుషుల ప్రపంచ కప్ అధికారిక లోగోను ఒడిశా రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ ఆవిష్కరించారు. ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ హాకీ(FIH‌)తో కలిసి ఒడిశా ప్రభుత్వం అతిథ్యం ఇస్తోంది. భువనేశ్వర్‌లోని కళింగ హాకీ స్టేడియంలో FIH ఒడిశా హాకీ పురుషుల ప్రపంచ కప్ 2023 అధికార లోగోను సీఎం పట్నాయక్‌ ఆవిష్కరించారు. 2023 జనవరి 13 నుంచి 29 వరకు హాకీ పురుషుల ప్రపంచ కప్‌ పోటీ జరుగనుంది. భువనేశ్వర్‌లోని కళింగ హాకీ స్టేడియంలో హాకీ టోర్నీలు జరుగనున్నాయి. అలాగే రూర్కెలాలో కొత్తగా నిర్మించిన బిర్సా ముండా అంతర్జాతీయ హాకీ స్టేడియంలో హాకీ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు.

ఈ ప్రపంచ్ కప్ హాకీ టోర్నీలో పలు దేశాలకు చెందిన హాకీ జట్లు తలపడనున్నాయి. ఒడిశా సీఎం పట్నాయక్‌ కూడా జాతీయ హాకీ క్రీడ పట్ల ఎక్కువగా ప్రాధాన్య కల్పిస్తున్నారు. అందుకే దేశీయ హాకీ టీమ్‌కు స్పాన్సర్‌గా ఒడిశా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. 2021 ఏడాదిలో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకంతో హిస్టరీ క్రియేట్ చేసింది. 41ఏళ్ల విరామం తర్వాత హాకీలో ఒలింపిక్‌ పతకం సాధించింది.

Official Logo Of Fih Odisha Hockey Men’s World Cup 2023 Unveiled By Cm Naveen Patnaik (1)

Official Logo Of Fih Odisha Hockey Men’s World Cup 2023 Unveiled By Cm Naveen Patnaik 

FIH హాకీ పురుషుల ప్రపంచ కప్ 15వ ఎడిషన్ దేశంలోని అతిపెద్ద హాకీ స్టేడియంలైన భువనేశ్వర్, రూర్కెలా రెండు సిటీల్లో నిర్వహించనున్నారు. కొత్త ప్రపంచ స్థాయి స్టేడియంలో 20వేల మంది సీటింగ్ కెపాసిటీ కలిగి ఉన్నాయి. ఈ హాకీ అధికారిక లోగోను ఆవిష్కరించిన సందర్భంగా సీఎం పట్నాయక్ మాట్లాడుతూ.. వరుసగా రెండోసారి FIH హాకీ పురుషుల ప్రపంచ కప్ లోగోను ఆవిష్కరించడం గర్వకారణమని, చాలా ఆనందంగా ఉందన్నారు.

Read Also : BlackBerry : బ్లాక్‌బెర్రీ కమ్‌బ్యాక్.. 5G ఫోన్ వచ్చేస్తోంది.. ఈసారి పక్కా..!