TMC Elecions: 2024లో మమతా ప్రధాని, అభిషేక్ సీఎం అంటోన్న టీఎంసీ ఎంపీ

తృణమూల్ కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ కునాల్ ఘోష్ ట్విట్టర్ వేదికగా అభిషేక్ 2036లో సీఎం అవుతాడని ప్రకటించిన మరుసటి రోజే..

TMC Elecions: 2024లో మమతా ప్రధాని, అభిషేక్ సీఎం అంటోన్న టీఎంసీ ఎంపీ

Mamata

Updated On : May 4, 2022 / 1:04 PM IST

TMC Elecions: తృణమూల్ కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ కునాల్ ఘోష్ ట్విట్టర్ వేదికగా అభిషేక్ 2036లో సీఎం అవుతాడని ప్రకటించిన మరుసటి రోజే.. టీఎంసీ అపారుప పొద్దర్ మరో కామెంట్ చేశారు. 2024లో మమతా బెనర్జీ ప్రధాని అవుతారని, అభిషేక్ బెనర్జీ సీఎం అవుతారంటూ పోస్టు చేసి ఒక గంటలోనే డిలీట్ చేశారు.

“తృణమూల్ కాంగ్రెస్ సైనికుడిగా చెప్తున్నా. 2036వరకూ మమతా బెనర్జీనే బెంగాల్ కు సీఎంగా ఉంటారు. ఆ తర్వాత మేనల్లుడు అభిషేక్ ను సీఎంగా చేసి తప్పుకుంటారు” అని కునాల్ ముందుగా ట్వీట్ చేశారు.

ఆ ట్వీట్లపై అపారుపను మీడియా అడగ్గా.. “అది నిజం మమతా బెనర్జీని 2024లో పీఎంగా చూడాలని అనుకుంటున్నాం. వెస్ట్ బెంగాల్ లో కనిపించిన అభివృద్ధిని దేశమంతా చూడాలని ఆశిస్తున్నాం. అలా జరిగితే అభిషేక్ బెనర్జీనే సీఎం అవుతారు” అని బదులిచ్చారు.

Read Also : విమానంలో కుదుపులు.. మమతకు వెన్నునొప్పి ?, విచారణకు టీఎంసీ సర్కార్ ఆదేశం

ఈ కామెంట్లపై బీజేపీ నాయకులు రాహుల్ సిన్హా మాట్లాడుతూ.. అభిషేక్ బెనర్జీ చాలా తెలివైన ప్రచారం చేస్తున్నారని, తాత్కాలికంగా ఐదు అంతస్థుల బిల్డింగ్ ను ప్రారంభించి అక్కడి నుంచి కార్యక్రమాలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు వివరించారు. టీఎంసీ జనరల్ పార్థ ఛటర్జీ మాట్లాడుతూ.. “తృణమూల్ భవన్ లో రెనొవేషన్ కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు కొత్త పార్టీ కార్యాలయంలో చర్చలు జరుపుతున్నారు.