×
Ad

Annamalai : చెన్నై వరదల్లో బీజేపీ చీఫ్ ఫొటోషూట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్

బతుకు జీవుడా అని వాళ్లు వెళ్తుంటే.. వారిని ఆపి.. కొందరిని దింపి ఆయన కూర్చుని మాట్లాడటం అవసరమా..........................

Annamalai

Annamalai : వరదల్లో చిక్కుకుని చెన్నై నగరం విలవిల్లాడిపోతోంది. ఐతే… సీఎం స్టాలిన్ సొంత నియోజకవర్గం కొలతూర్ జనం… వరదలో చిక్కుకుని ఇబ్బందిపడుతున్నారని సింబాలిక్ గా చెప్పేందుకు బీజేపీ చీఫ్ కె.అన్నామలై చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది.

Read This : Tamil Nadu rains: చెన్నైలో నదుల్లా మారిన వీధులు.. రెండు రోజులు సెలవు ప్రకటించిన ప్రభుత్వం

ఓ పడవలో బీజేపీ చీఫ్ అన్నామలై మరో నాయకుడితో కలిసి ఎక్కారు. అటూ ఇటూ ఊగిపోతున్న పడవలో.. ఎలా కూర్చోవాలి.. జనంతో ఎలా మాట్లాడాలి అనేది రిహార్సల్స్ చేశారు. కెమెరామెన్, వీడియో గ్రాఫర్లకు .. ఎక్కడుండాలి.. ఎలా వీడియో తీయాలి అంటూ సూచనలు ఇచ్చారు. ఇదంతా.. వీడియోల్లో రికార్డ్ కావడంతో… అదే స్థాయిలో ‘ఇచ్చి పడేస్తున్నారు’ తమిళ తంబీలు, డీఎంకే అనుచరులు.

పడవలో.. మోకాలి లోతు నీళ్లలో పలు కాలనీల్లో పర్యటించారు అన్నామలై. గ్రౌండ్ లో ఉండేవారు ఫస్ట్ ఫ్లోర్ కు వెళ్లాలని కొందరికి సూచనలు ఇచ్చారు. నీళ్లలోనూ నడిచి వెళ్లారు. ఐతే… బోటులో అన్నామలై చేసిన ప్రయాణం.. అందుకు తీసుకున్న ఫొటోషూట్ ప్రయత్నాలు.. తీవ్ర విమర్శలు పాలవుతున్నాయి.

#GoatOnBoat పేరుతో సోషల్ ప్లాట్‌ఫాంలలో విమర్శలు చేస్తూ సెటైర్లు వేస్తున్నారు తమిళియన్లు. ఓ పడవలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బాధిత కుటుంబాన్ని తరలిస్తుండగా దాన్ని ఆపి అందులో ఎక్కి వారిని పరామర్శించారు అన్నామలై. ఇది కూడా ట్రోలింగ్ కు తోడైంది. బతుకు జీవుడా అని వాళ్లు వెళ్తుంటే.. వారిని ఆపి.. కొందరిని దింపి ఆయన కూర్చుని మాట్లాడటం అవసరమా అని విమర్శిస్తున్నారు మరికొందరు.

Read This :Chennai Rain : చెన్నై నగరంలో కుంభవృష్టి…లోకల్ ట్రైన్స్ రద్దు