Corona Cases (3)
Corona Cases : దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. బుధవారం 6984 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ రోజు 14 శాతం కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,974 కరోనా కేసులు నమోదైనట్లు హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లో 24 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 3,47,18,602కు చేరింది. ఇందులో 3,41,54,879 మంది కరోనా నుంచి కోలుకోగా, 4,76,478 మంది మృతిచెందారు. మరో 87,245 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 135.25 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని, బుధవారం ఒక్కరోజే 68,89,025 మందికి టీకాలు ఇచ్చామని తెలిపింది.
చదవండి : Corona Update : భారత్‌లో భారీగా తగ్గిన కరోనా కేసులు.. క్రమంగా పెరుగుతున్న ఒమిక్రాన్
ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య అదుపులోకి వస్తున్న సమయంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. గురువారం ఉదయం 10 గంటల వరకు దేశ వ్యాప్తంగా 73 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. బుధవారం ఒక్కరోజే 12 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు తెలిపారు. తెలంగాణలో కూడా రెండు ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లుగా అధికారులు తెలిపారు. ఈ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది.
చదవండి : Corona Cases : దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. పెరిగిన ఒమిక్రాన్ కేసులు