Corona Update : భారత్‌లో భారీగా తగ్గిన కరోనా కేసులు.. క్రమంగా పెరుగుతున్న ఒమిక్రాన్

శంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులిటెన్‍‌ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 5,784 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Corona Update : భారత్‌లో భారీగా తగ్గిన కరోనా కేసులు.. క్రమంగా పెరుగుతున్న ఒమిక్రాన్

Corona Cases (5)

Corona Update : దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులిటెన్‍‌ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 5,784 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 252 మంది కరోనా బాధితులు మృతి చెందారు. ఇక ఇదే సమయంలో 7,995 మంది పూర్తి స్థాయిలో కోలుకున్నట్లుగా బులిటెన్‍‌లో పేర్కొన్నారు.

ప్రస్తుతం దేశ్యాప్తంగా 88,993 యాక్టివ్‌ కేసులు ఉండగా… ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,47,03,644కు చేరింది.. కోలుకున్నవారి సంఖ్య 3,41,38,763 కి పెరిగింది.. ఇక, మరణాల సంఖ్య 4,75,888 కి పెరిగినట్టు వెల్లడించింది. ఇప్పటి వరకు 1,33,88,12,577 వ్యాక్సిన్‌ పంపిణీ జరిగింది. గత 24 గంటల్లో 66,98,601 డోసుల వ్యాక్సిన్‌ పంపిణీ చేశారు.

చదవండి : Corona Cases : దేశంలో 7,774 కరోనా కేసులు.. రాష్ట్రాలకు లేఖలు రాసిన కేంద్ర ఆరోగ్యశాఖ

ఇక కరోనా కేసులు తగ్గుతుంటే.. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 41 కరోనా ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ వేరియంట్ సోకినవారిలో స్వల్ప లక్షణాలు ఉన్నట్లుగా చెబుతున్నారు వైద్యులు. ఇక విదేశాల నుంచి వచ్చే వారికి పరీక్షలు చేసిన తర్వాతనే విమానాశ్రయం నుంచి బయటకు పంపుతున్నారు అధికారులు.

అయితే కొందరికి విమానాశ్రయంలో చేసిన పరీక్షల్లో నెగటివ్ వచ్చి.. కొద్దీ రోజుల తర్వాత బయట చేయించుకుంటే పాజిటివ్ వస్తుంది. తాజాగా నమోదైన కేసుల్లో చాలా కేసులు ఇలా జరిగినవే. దీంతో అధికారులు అప్రమత్తమై విదేశాల నుంచి వచినవారిపై ప్రత్యేక నిఘా ఉంచారు.

చదవండి : Corona In Telangana : తెలంగాణలో కొత్తగా 188 కరోనా కేసులు, ఒకరు మృతి