×
Ad

Corona Update : దేశంలో కొత్తగా 36వేల కరోనా కేసులు.. 530 మంది మృతి

దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 36,401 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది.

Corona Update

Corona Update : దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 36,401 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది. 24 గంటల వ్యవధిలో 39,157మంది బాధితులు కోలుకొని ఇళ్లకు వెళ్లారు. 24 గంటల్లో 530 మంది బాధితులు మహమ్మారి బారినపడి మరణించారు. ఇక తాజాగా నమోదైన మరణాలతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 3,23,22,258కు చేరింది.

మొత్తం కేసుల్లో ఇందులో 3,15,25,800 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 3,64,129 ఉన్నాయని చెప్పింది. వైరస్‌ బారినపడి ఇప్పటి వరకు 4,33,049 మంది కన్నుమూశారు. మహారాష్ట్రలో అత్యధిక కరోనా మరణాలు సంభవించాయి. ఇక కేరళలో ఇప్పటికి కరోనా ఉదృతి తగ్గలేదు.. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 50శాతానికి పైగా కేసులు కేరళలో నమోదవుతున్నాయి.

ఇక టీకా విషయానికి వస్తే బుధవారం వరకు 56.64కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు మంత్రిత్వ శాఖ చెప్పింది. జాతీయ రికవరీ రేటు 97.53 శాతానికి పెరిగిందని, రోజువారి పాజిటివిటీ రేటు 1.94శాతంగా ఉందని చెప్పింది. బుధవారం దేశవ్యాప్తంగా 18,73,757 కొవిడ్‌ శాంపిల్స్‌ పరీక్షించగా.. ఇప్పటి వరకు 50,03,00,840 నమూనాలను పరిశీలించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ వివరించింది.