Corona Cases : ఇండియా కరోనా అప్డేట్

దేశంలో కరోనా కేసుల సంఖ్య ఈ రోజు స్వల్పంగా పెరిగింది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం… గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో కొత్తగా 7,145 కేసులు న‌మోద‌య్యాయి

Corona

Corona Cases : దేశంలో కరోనా కేసుల సంఖ్య ఈ రోజు స్వల్పంగా పెరిగింది. ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం శనివారం భారత్‌లో కొత్తగా 7,145 కేసులు న‌మోద‌య్యాయి. కరోనాతో గడిచిన 24 గంటల్లో 289 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 4,77,158 చేరింది. దేశంలో 84,565 యాక్టీవ్‌‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 8,706 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.

చదవండి : Corona Cases : స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. భయపెడుతున్న ఒమిక్రాన్ వేరియంట్

ఇక దేశంలో ఇప్పటి వరకు రికవరీ అయిన వారి సంఖ్య 3,46,24,360 గా నమోదు అయింది. ఇక దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. ఇప్పటి వ‌ర‌కు మొత్తం 1,36,66,05,173 మందికి టీకాలు వేసిన‌ట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. దేశంలో 111 ఒమిక్రాన్ కేసులు వెలుగులోకి వచ్చాయి. మహారాష్ట్రలో అత్యధిక ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి

చదవండి : Corona Update : భారత్‌లో భారీగా తగ్గిన కరోనా కేసులు.. క్రమంగా పెరుగుతున్న ఒమిక్రాన్
చదవండి : Corona Cases : దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. పెరిగిన ఒమిక్రాన్ కేసులు