Farmers Protest : ఆందోళనలు విరమించాలా ? రైతుల సమావేశం..భవిష్యత్ కార్యాచరణ

వ్యవసాయ చట్టాలను రద్దు చేసినప్పటికీ మిగతా వాటిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దీంతో 2021, డిసెంబర్ 04వ తేదీ శనివారం సింఘు సరిహద్దు వద్ద రైతు సంఘాల నేతలు సమావేశం కాబోతున్నారు.

Singhu Border : ఢిల్లీ సరిహద్దుల వద్ద ఆందోళనలు కొనసాగిస్తున్న రైతులు కీలక సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంతో భవిష్యత్‌ కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నారు. ఆందోళనలు విరమించాలా.. లేక మిగతా డిమాండ్‌ల గురించి ధర్నాలు కొనసాగించాలా అనే దానిపై చర్చించనున్నారు. ఎంఎస్‌పీకి చట్టబద్ధత, రైతులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయడంతో పాటు, అమరులైన అన్నదాతలకు పరిహారం ఇవ్వాలని ఇప్పటికే రైతులు డిమాండ్‌ చేశారు. అలాగే విద్యుత్‌ చట్ట సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని కోరారు.

Read More : Konijeti Rosaiah No more: మాజీ సీఎం రోశయ్య ఇకలేరు.. ప్రముఖుల సంతాపం

వీటితో పాటు అమరవీరుల స్థూపం ఏర్పాటు చేయడానికి ఢిల్లీలో స్థలం ఇవ్వాలని సూచించారు. ఈ డిమాండ్లను నెరవేరిస్తేనే ఆందోళన విరిమిస్తామని ఇవాళ్టిలోగా వీటిపై హామీ ఇవ్వాలని అల్టిమేటం జారీ చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం వ్యవసాయ చట్టాలను రద్దు చేసినప్పటికీ మిగతా వాటిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దీంతో 2021, డిసెంబర్ 04వ తేదీ శనివారం సింఘు సరిహద్దు వద్ద రైతు సంఘాల నేతలు సమావేశం కాబోతున్నారు. తదుపరి కార్యాచరణను ప్రకటించనున్నారు.

Read More : Kareena Kapoor : నైటీతో బయటకి వచ్చిందంటూ కరీనాను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

జూన్‌ 5, 2020 వ్యవసాయ చట్టాల రూపకల్పన జరిగినప్పటి నుంచి న్యాయం చేయాలంటూ అన్నం పెట్టే అన్నదాత న్యాయం కోసం రోడ్డెక్కాడు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని పట్టు విడవకుండా ఉక్కు సంకల్పంతో ఆందోళన చేశారు. ఎముకల కొలికే చలిని సైతం లెక్కజేయలేదు. ట్రాక్టర్లనే తాత్కాలిక నివాసాలు చేసుకొని.. రోడ్లపైనే భోజనాలు చేశారు. 15 నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లోనే బైఠాయించి రైతు సంఘాలు కదం తొక్కాయి.. రోజుకో తీరుగా తమ పోరాటాన్ని కొనసాగించారు.. దీంతో కేంద్రం ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. అన్నదాత ఆందోళనలను దృష్టిలో ఉంచుకొని చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటూ సంచలన నిర్ణయం తీసుకున్నారు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ. గురునానక్ జయంతి సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.. రైతులను ఒప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేసినా… రైతులను సంతృప్తి పరచలేకపోయామని అందుకే వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నామని చెప్పారు. పార్లమెంట్ సైతం చట్టాల రద్దును ఆమోదింప చేసింది. అయితే..మరికొన్ని డిమాండ్స్ వినిపిస్తున్నారు రైతులు. ప్రస్తుతం రైతు సంఘాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు