Tomatoes : ఆగస్టు 15 నుంచి రూ.50కి తగ్గిన టమాటాల ధర

దేశంలో ఆగస్టు 15వతేదీ నుంచి టమాటా ధరలు తగ్గాయి. హోల్‌సేల్ మార్కెట్లో టమాటా ధరలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కిలో రూ.70 నుంచి 50 రూపాయలకు విక్రయించనున్నారు. మంగళవారం నుంచి కిలో టమాటా రూ.50 రిటైల్ ధరకే విక్రయించాలని జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య (ఎన్‌సిసిఎఫ్‌), నేషనల్‌ అగ్రికల్చరల్‌ కోఆపరేటివ్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (నాఫెడ్‌) సంస్థలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది....

Tomatoes

Tomatoes : దేశంలో ఆగస్టు 15వతేదీ నుంచి టమాటా ధరలు తగ్గాయి. హోల్‌సేల్ మార్కెట్లో టమాటా ధరలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కిలో రూ.70 నుంచి 50 రూపాయలకు విక్రయించనున్నారు. మంగళవారం నుంచి కిలో టమాటా రూ.50 రిటైల్ ధరకే విక్రయించాలని జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య (ఎన్‌సిసిఎఫ్‌), నేషనల్‌ అగ్రికల్చరల్‌ కోఆపరేటివ్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (నాఫెడ్‌) సంస్థలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. (Tomatoes to be sold at Rs 50 per kg)

Russia : రష్యా గ్యాస్ స్టేషనులో పేలుడు…12మంది మృతి, 60మందికి గాయాలు

హోల్ సేల్ మార్కెట్లలో టమాటా ధరలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో వినియోగదారుల వ్యవహారాల శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. (down from Rs 70) ఎన్‌సిసిఎఫ్‌, నాఫెడ్‌ సంస్థలు రాజస్థాన్, ఢిల్లీ, ఎన్సీఆర్, జైపూర్, కోటా, లక్నో, కాన్పూర్, వరణాసి, ప్రయాగ్ రాజ్, పాట్నా,ముజఫర్‌పూర్, అర్రా, బక్సర్‌ నగరాల్లో టమాటాలను విక్రయిస్తున్నాయి. పెరుగుతున్న ధరలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వ ఆదేశంతో ప్రభుత్వరంగ సంస్థలు ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో టమాటాల రిటైల్ అమ్మకం జులై 14 నుంచి ప్రారంభించాయి.

Nigeria : నైజీరియాలో ముష్కరుల దాడి..26 మంది సైనికుల మృతి, కూలిన హెలికాప్టర్

ఢిల్లీ అంతటా 70 ప్రదేశాల్లో, నోయిడా, గ్రేటర్ నోయిడాలోని 15 ప్రదేశాల్లో మొబైల్ టమాటా దుకాణాలను నడుపుతున్నారు. ఎన్‌సీసీఎఫ్‌, నాఫెడ్‌లు కొనుగోలు చేసిన టమాటా రిటైల్‌ ధరను తొలుత కిలో రూ.90గా నిర్ణయించాయి. ఆ తర్వాత రూ.80కి తగ్గించింది. ఇది జులై 20 నుంచి కిలోకు రూ. 70కి తగ్గించారు.ఏజెన్సీ ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) తన ప్లాట్‌ఫారమ్ ద్వారా టమాటాల రిటైల్ విక్రయాలను కూడా చేస్తోంది. నాఫెడ్ వినియోగ కేంద్రాలలో రిటైల్ అమ్మకం కోసం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర మార్కెట్‌ల నుంచి టమాటాలను కొనుగోలు చేయడం ప్రారంభించాయి. దీని వల్ల వీటి ధరలు బాగా పెరిగాయి.