Tamil Nadu - Elephant Dies (Photo : Google)
Tamil Nadu – Elephant Dies : తమిళనాడులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆరేళ్ల వయసున్న ఆడ ఏనుగు మృతి చెందిన ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. పండు అనుకుని ఏనుగు నాటు బాంబును కొరికింది. అంతే, ఏనుగు నోటిలో ఒక్కసారిగా నాటు బాంబు పేలింది. ఈ పేలుడుతో నోటి దగ్గర తీవ్రంగా రక్తం స్రావం అయ్యింది.
పాపం ఏనుగు నొప్పితో విలవిలలాడింది. సాయం కోసం రోడ్డు మీదకు వచ్చి పెద్ద ఎత్తున అరుస్తూ ఆర్తనాదాలు చేసింది. నోటి నుంచి రక్తం కారుతున్నా సహాయం కోసం రోడ్డు మీద తిరిగింది గజరాజు. చివరికి ఓ గ్రామ సమీపంలో నొప్పి భరించలేక మృతి చెందింది.
Also Read..Healthy Eating : రోగాలకు దూరంగా ఉండాలంటే.. వీటిని ఆహారంలో చేర్చుకోండి !
అడవి పందుల కోసం వేటగాళ్ళు ఏర్పాటు చేసిన నాటు బాంబును పండుగా భావించి ఏనుగు తినడంతో ఈ ప్రమాదం జరిగింది. కోయంబత్తూరు-ఊటీ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఏనుగు ఆర్తనాదాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన జంతు ప్రేమికులను తీవ్రంగా బాధించింది. పాపం, నొప్పి భరించలేక సాయం కోసం ఆ ఏనుగు చేసిన ఆర్తనాదాలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి.
నోటిలో బాంబు పేలినప్పటి నుంచి ఆ ఏనుగు తిండి తినలేకపోయింది. చివరికి ఆకలితో చనిపోయింది. ఆ నాటు బాంబుని అవుత్తుక్కై అని పిలుస్తారు. అడవి పందులు తమ పొలాల్లోకి ప్రవేశించకుండా నిరోధించడానికి స్థానిక రైతులు సాధారణంగా ఒక పండు లేదా కూరగాయల లోపల ఈ నాటు బాంబును దాచి పెడతారు. ఒక జంతువు అవుత్తుకాయ్‌ను కొరికినప్పుడు, అది పేలి, జంతువు నోటికి తీవ్ర నష్టం కలిగిస్తుంది. ఏనుగు ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన అధికారులు అవుత్తుక్కై (నాటు బాంబు) కారణంగా గాయాలై ఉండొచ్చని తెలిపారు. నోటిలో తీవ్రమైన గాయాల కారణంగా కొన్ని రోజులుగా ఏనుగు ఏమీ తినలేకపోయిందని, ఆకలితో మరణించిందని ధృవీకరించారు.
Also Read..Heart Health : గుండె ఆరోగ్యానికి మేలు చేసే పెరుగు !