Uttarakhand : పవన్ పాటకు స్టెప్పులు వేసిన ట్రైనీ ఐఏఎస్‌లు.. వీడియో వైరల్

పవన్ కల్యాణ్ పాటకు స్పెప్పులు వేసే ఫ్యాన్స్ లక్షల్లో ఉన్నారు. ఇప్పుడు ట్రైనీ ఐఏఎస్‌లు కూడా పవన్ పాటకు పాదం కదిపారు. వాళ్లు చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Uttarakhand

Uttarakhand : పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కి ఉన్న క్రేజ్ సంగతి తెల్సిందే. ఆయన మాట, పాట వింటే చాలు ఫ్యాన్స్‌కి పూనకాలే. తాజాగా ట్రైనీ ఐఏఎస్‌లు పవన్ పాటకు స్టెప్పులు వేయడం వైరల్‌గా మారింది.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్క్రీన్ మీద కనిపిస్తే ఫ్యాన్స్ గోల ఓ రేంజ్‌లో ఉంటుంది. ఆయన పాటలకి డ్యాన్సుల మోత మోగించే అభిమానులు లక్షల్లో ఉంటారు. సోషల్ మీడియాలో సైతం అభిమానులు డ్యాన్స్ వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. తాజాగా లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (LBSNAA) లో జరిగిన ఓ క్యార్యక్రమంలో ట్రైనీ ఐఏఎస్‌లు పవన్ పాటకు స్టెప్పులు వేయడం వైరల్‌గా మారింది.

Rachin Ravindra: రచిన్ రవీంద్ర వీడియా వైరల్.. ఇంతకీ ఏముంది అందులో?

గబ్బర్ సింగ్ సినిమాలో ‘కెవ్వు కేక నా సామిరంగా కెవ్వు కేక’ పాటకి ఐఏఎస్‌లు వేదికపై వీర లెవెల్లో స్టెప్పులు వేశారు. పూనకాలు వచ్చినట్లు ఊగిపోయారు. వీరి డ్యాన్స్ వీడియోను పవన్ ఫ్యాన్స్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

IAS లో సెలక్ట్ అయిన వారందరికీ LBSNAA లో ఫౌండేషన్ కోర్సు తప్పనిసరిగా ఉంటుంది. వీరికి వివిధ అంశాలలో ఇక్కడ శిక్షణ ఇస్తారు. పరిపాలన విషయాలతో పాటు వారు పని చేయబోయే సామాజిక, ఆర్ధిక, రాజకీయ పరిస్థితులపై అధికారులకు విస్తృత అవగాహన కల్పించేందుకు ఫౌండేషన్ కోర్సు ఇస్తారు. ప్రభుత్వంలో పనిచేస్తున్న పలు శాఖలు, సంస్థలు అలాగే వారు అమలు చేయడానికి అందుబాటులో ఉంటే చట్టాలు, నిబంధనల గురించి వీరికి ఇక్కడ పూర్తి అవగాహన కల్పిస్తారు.

Leopard : చెట్టు ఇనుపతీగలో చిక్కుకు పోయిన చిరుతపులి…ఎలా కాపాడారంటే…వీడియో వైరల్

ఇలా ఇక్కడ శిక్షణలో ఉన్న ట్రైనీ ఐఏఎస్‌లు డ్యాన్సులు చేస్తూ రిలాక్స్ అయ్యారు. ప్రస్తుతం వీరు పవన్ సాంగ్‌కి వేసిన స్టెప్పులు వైరల్ అవుతున్నాయి.