Leopard : చెట్టు ఇనుపతీగలో చిక్కుకు పోయిన చిరుతపులి…ఎలా కాపాడారంటే…వీడియో వైరల్

చెట్టు ఇనుప తీగలో చిక్కుకుపోయి వేలాడుతున్న చిరుతపులిని అటవీశాఖ సిబ్బంది రక్షించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలోని అటవీ గ్రామంలో ఓ చిరుతపులి క్లచ్ వేరుకు చిక్కుకొని చెట్టుకు వేలాడుతుండటం చూశారు....

Leopard : చెట్టు ఇనుపతీగలో చిక్కుకు పోయిన చిరుతపులి…ఎలా కాపాడారంటే…వీడియో వైరల్

Leopard hangs from tree

Leopard : చెట్టు ఇనుప తీగలో చిక్కుకుపోయి వేలాడుతున్న చిరుతపులిని అటవీశాఖ సిబ్బంది రక్షించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలోని అటవీ గ్రామంలో ఓ చిరుతపులి క్లచ్ వేరుకు చిక్కుకొని చెట్టుకు వేలాడుతుండటం చూశారు. స్థానిక ప్రజలు ఈ విషయాన్ని జంతు సంరక్షణ, పునరావాస కేంద్రం రెస్క్యూ వ్యవస్థాపకురాలు నేహా పంచమియాకు సమాచారం అందించారు. నేహపంచమియా ఈ విషయాన్ని నాసిక్ అటవీశాఖ ఉద్యోగులకు సమాచారం అందించారు.

Also Read : School Teacher : 14 ఏళ్ల విద్యార్థితో పాఠశాల మహిళా టీచర్ లైంగిక సంబంధం…నిందితురాలి అరెస్ట్

రెస్క్యూ బృందం వచ్చి చిరుతపులికి మత్తు మందు ఇచ్చి వైరు కట్ చేసి దాన్ని కిందకు దించారు. అనంతరం చిరుత పాదాలపై అయిన గాయానికి చికిత్స చేశారు. గాయానికి కట్టు కట్టి మందులు వేశారు. దీంతో చిరుతపులి కోలుకుంది. చిరుతపులి గాయం నుంచి కోలుకున్నాక దాన్ని సురక్షితమైన అటవీ నివాస స్థలంలో వదిలారు. చిరుతపులిని కాపాడిన వీడియోను జంతు సంరక్షణ, పునరావాస కేంద్రం వ్యవస్థాపకురాలు నేహా పంచమియా ఎక్స్ లో పంచుకున్నారు.

Also Read : Encounter : జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌…లష్కరే తోయిబా ఉగ్రవాది హతం, కొనసాగుతున్న గాలింపు

ఈ వీడియో నవంబర్ 6వతేదీన పోస్ట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 11వేలమందికి పైగా వీక్షించారు. ఈ పోస్టుకు 300 లైక్‌లు వచ్చాయి. ఈ వినూత్న వీడియోకు ప్రతిస్పందిస్తూ నెటిజన్లు విభిన్నమైన కామెంట్లు పెట్టారు. ‘‘వావ్, మీరు చేస్తున్న గొప్ప పని! అయితే ఒకే ఒక్క ప్రశ్న, మత్తు ఇచ్చినప్పుడు చిరుతపులి ముఖం ఎందుకు కప్పి ఉంచారు?’’అని ఒక నెటిజన్ అడిగారు.

Also Read : US singer Mary Millben : ప్రధాని మోదీకి యూఎస్ గాయకురాలు మేరీ మిల్‌బెన్ మరోసారి ప్రశంసలు

చిరుతపులిని ప్రశాంతంగా ఉంచి,ఒత్తిడిని తగ్గిస్తుందని పంచమియా బదులిచ్చారు. అయ్యో, చిరుతపులి భయంకరమైనది. దాన్ని రక్షించినందుకు సంతోషంగా ఉందని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు. అద్భుతమైన రెస్క్యూ ఆపరేషన్ అని మరో నెటిజన్ పేర్కొన్నారు. ‘‘ప్రశంసనీయమైనది! చాలా బాగా చేశారు’’ అని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు.