Encounter : జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌…లష్కరే తోయిబా ఉగ్రవాది హతం, కొనసాగుతున్న గాలింపు

జమ్మూ కాశ్మీర్‌లో గురువారం ఉదయం లష్కరే తోయిబా ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.ఈ ఎన్‌కౌంటర్‌ లో లష్కరే తోయిబా ఉగ్రవాది హతం అయ్యాడు.....

Encounter : జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌…లష్కరే తోయిబా ఉగ్రవాది హతం, కొనసాగుతున్న గాలింపు

Army

Encounter : జమ్మూ కాశ్మీర్‌లో గురువారం ఉదయం లష్కరే తోయిబా ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.ఈ ఎన్‌కౌంటర్‌ లో లష్కరే తోయిబా ఉగ్రవాది హతం అయ్యాడు. జమ్మూ కాశ్మీర్‌లోని షోపియాన్‌లోని కథోహలన్ ప్రాంతంలో లష్కరే తోయిబా (ఎల్‌ఇటి)కి చెందిన నిషేధిత సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టిఆర్‌ఎఫ్)కి అనుబంధంగా ఉన్న ఉగ్రవాదిని భద్రతా బలగాలు గురువారం మట్టుబెట్టాయి.

Also Read : Mahua Moitra : మహువా మొయిత్రా లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయండి… ఎథిక్స్ ప్యానెల్ సంచలన సూచన

తెల్లవారుజామున ప్రారంభమైన ఈ ఎన్‌కౌంటర్ స్థానిక పోలీసులు, భారత సైన్యం సంయుక్తంగా చేపట్టింది. ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు ఇంకా గాలింపు కొనసాగిస్తున్నాయి. మరణించిన ఉగ్రవాదిని ఇంకా గుర్తించలేదు. ఎన్‌కౌంటర్ స్థలం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు జమ్మూకశ్మీర్ పోలీసులు తెలిపారు. ఈ ఎదురుకాల్పుల ఘటనపై కాశ్మీర్ జోన్ పోలీసులు గురువారం ఎక్స్ లో పోస్టు చేశారు.

Also Read : US singer Mary Millben : ప్రధాని మోదీకి యూఎస్ గాయకురాలు మేరీ మిల్‌బెన్ మరోసారి ప్రశంసలు

జమ్మూకశ్మీరులో ఇటీవల ఉగ్రవాదుల ప్రాబల్యం పెరగడంతో కేంద్ర భద్రతాబలగాలు వారి కోసం గాలింపును ముమ్మరం చేశారు. దీంతో జమ్మూకశ్మీరులో తరచూ ఎదురుకాల్పుల ఘటనలు జరుగుతున్నాయి. ఇటీవల పాకిస్థాన్ నుంచి సరిహద్దుల మీదుగా ఉగ్రవాదులు అక్రమంగా చొరబడేందుకు చేసిన యత్నాలను బీఎస్ఎఫ్ బలగాలు తిప్పికొట్టాయి. దీంతో సరిహద్దుల్లో అప్రమత్తమైన బీఎస్ఎఫ్ బలగాలు చొరబాట్లు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు చేశాయి.

పాక్ కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవానుకు గాయాలు

మరో కాల్పుల ఘటనలో ఓ బీఎస్ఎఫ్ జవాన్ గాయపడ్డారు. రామ్‌ఘర్ సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్థాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించడంతో ఒక సరిహద్దు భద్రతా దళం జవాన్ గాయపడ్డాడు. కశ్మీర్ లోయలో ఉగ్రవాదులు ఇటీవల జరిపిన మూడు దాడుల్లో ఒక పోలీసు, స్థానికేతర కార్మికుడిని చంపిన వారి గురించి సమాచారం ఇస్తే ఒక్కొక్కరికి రూ.10 లక్షల రివార్డు ఇస్తామని జమ్మూ కాశ్మీర్ పోలీసులు ప్రకటించారు.

Also Read : Artificial rain : ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు బయటి యాప్ ఆధారిత టాక్సీలపై నిషేధం…నవంబర్ 20-21 తేదీల్లో కృత్రిమ వర్షాలు

అక్టోబరు 29వతేదీన శ్రీనగర్‌లోని ఈద్గా ప్లేగ్రౌండ్‌లో క్రికెట్ ఆడుతున్న పోలీసు ఇన్‌స్పెక్టర్ మస్రూర్ అలీ వానీపై ఒక్క ఉగ్రవాది కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడ్డాడు. మరుసటి రోజు పుల్వామాలోని ట్రుమ్చి నౌపోరా ప్రాంతంలో ముఖేష్ కుమార్ అనే స్థానికేతర కార్మికుడిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఒక రోజు తర్వాత బారాముల్లాలోని వైలూ క్రాల్‌పోరా ప్రాంతంలో హెడ్ కానిస్టేబుల్ గులాం మహ్మద్ ను తన నివాసం వెలుపల కాల్చి చంపారు.