School Teacher : 14 ఏళ్ల విద్యార్థితో పాఠశాల మహిళా టీచర్ లైంగిక సంబంధం…నిందితురాలి అరెస్ట్

ఓ పాఠశాల మహిళా ఉపాధ్యాయురాలు 14 ఏళ్ల విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకున్న ఘటన సంచలనం రేపింది. యునైటెడ్ స్టేట్స్‌లోని ఒక మాజీ మిడిల్ స్కూల్ మహిళా టీచర్ 8 సంవత్సరాల క్రితం ఎనిమిదో తరగతి విద్యార్థితో లైంగిక చర్యలకు పాల్పడినందుకు ఆమెను అరెస్టు చేశారు.....

School Teacher : 14 ఏళ్ల విద్యార్థితో పాఠశాల మహిళా టీచర్ లైంగిక సంబంధం…నిందితురాలి అరెస్ట్

Arrest

School Teacher : ఓ పాఠశాల మహిళా ఉపాధ్యాయురాలు 14 ఏళ్ల విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకున్న ఘటన సంచలనం రేపింది. యునైటెడ్ స్టేట్స్‌లోని ఒక మాజీ మిడిల్ స్కూల్ మహిళా టీచర్ 8 సంవత్సరాల క్రితం ఎనిమిదో తరగతి విద్యార్థితో లైంగిక చర్యలకు పాల్పడినందుకు ఆమెను అరెస్టు చేశారు. 31 ఏళ్ల మహిళా ఉపాధ్యాయురాలు 2015వ సంవత్సరంలో మోంట్‌గోమేరీ విలేజ్ మిడిల్ స్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు.

14 ఏళ్ల బాలుడితో 22 ఏళ్ల టీచర్ లైంగిక సంబంధం

టీచరుగా పనిచేస్తూ అదే స్కూలులో చదువుతున్న 14 ఏళ్ల విద్యార్థితో లైంగిక చర్యలకు పాల్పడ్డారని మోంట్‌గోమెరీ కౌంటీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోలీస్ వెల్లడించింది. మహిళా టీచరు వయసు 22 ఏళ్లు కాగా బాధితుడైన బాలుడి వయసు 14 ఏళ్లు అని పోలీసులు చెప్పారు. తాను మైనర్‌గా ఉన్నప్పుడు అప్పర్ మార్ల్‌బోరోకు చెందిన 31 ఏళ్ల మహిళా టీచర్ తనపై లైంగిక చర్యలకు పాల్పడ్డారని బాధితుడు ఆరోపించాడు.

బాలుడికి మద్యం తాగించి…లైంగిక సంబంధం

2015వ సంవత్సరంలో మహిళా ఉపాధ్యాయురాలు మైనర్ విద్యార్థికి మద్యం, గంజాయి తాగించి మత్తులోకి దించి అతనితో లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు పోలీసులు చెప్పారు. బాలుడిపై మహిళా టీచర్ 20 సార్లు కంటే ఎక్కువ సార్లు అఘాయిత్యం చేశారని పోలీసులు పేర్కొన్నారు. టీచరు తన కారులో, పలు ఇళ్లలో బాలుడితో లైంగిక చర్యలకు పాల్పడిందని పోలీసులు వివరించారు.

Also Read : US singer Mary Millben : ప్రధాని మోదీకి యూఎస్ గాయకురాలు మేరీ మిల్‌బెన్ మరోసారి ప్రశంసలు

ఈ మహిళా టీచరును పోలీసులు అక్టోబరు 31వతేదీన అరెస్ట్ చేశారు. ఈమె మరో మైనర్ బాలుడిపై కూడా లైంగిక వేధింపులకు పాల్పడిందని, మరికొందరు ఈమె బాధితులు ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. బాలుడిని లైంగికంగా వేధించిన మహిళా టీచరును తాము ఉద్యోగం నుంచి తొలగించామని మోంట్ గోమేరి విలేజ్ స్కూలు ప్రతినిధి చెప్పారు.