Trans couple blessed with baby in Kerala
Transgender couple: కొద్ది రోజులుగా బాగా వైరల్ అయిన ట్రాన్స్‌జెండర్ జంట తల్లిదండ్రులు అయ్యారు. ఇలా తల్లిదండ్రులైన భారతదేశంలోని మొదటి ట్రాన్స్‌జెండర్ జంట ఇదే. కేరళలోని కొజికోడ్ ఆసుపత్రిలో బుధవారం ఉదయం జహాద్ అనే ట్రాన్స్‌జెండర్ యువకుడు పండండి బిడ్డకు జన్మనిచ్చాడు. పుట్టిన బిడ్డ ఫొటోలను ఈ జంట సోషల్ మీడియాలో పంచుకుంది. బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉందని, తల్లిదండ్రులు కావాలనుకునే తమ కల ఇన్నాళ్లకు నెరవేరిందని సంతోషంతో పువ్వులు పూయించారు. నిజానికి ఈ ఆనంద సమయంలో ఆనందభాష్పాలు వస్తున్నాయంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తమ కోసం ప్రార్థించినవారికి కృతజ్ణతలు తెలియజేశారు. అయితే పుట్టిన బిడ్డ ఆడనా మగనా అనే విషయాన్ని మాత్రం బయటికి వెల్లడించలేదు.
Coin Vending Machine: కాయిన్లకు ప్రత్యేకంగా ఏటీఎం.. నోట్లే కాదు, ఇక నాణేలు కూడా ఎనీ టైం తీసుకోవచ్చు
కేరళకు చెందిన జియా, జహాద్ భార్యభర్తలు. ఇద్దరూ ట్రాన్స్‌జెండర్లే.. జియా పురుషుడిగా పుట్టి స్త్రీగా మారగా, జహాద్ స్త్రీగా పుట్టి పురుషుడిగా మారిపోయాడు. గత మూడేళ్లుగా కలిసి ఉంటున్న వీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడి పెళ్లిచేసుకున్నారు. ట్రాన్స్‌జెండర్లైనా అందరిలానే కూడా పిల్లల్ని కనాలని ఈ జంట కోరుకుంది. తన శరీరంలో గర్భసంచి ఇంకా ఉండడంతో.. ఐవీఎఫ్ విధానంతో గర్భం దాల్చాడు జహాద్.
Marriage in Burial Ground : శ్మశానంలోనే పెళ్లి..విందు భోజనాలు కూడా అక్కడే
ఆడవారికి మాత్రమే దేవుడు ప్రసాదించిన ఏకైక వరం అమ్మదనం. ఇప్పుడు ఆ అమ్మదనాన్ని ఓ ట్రాన్స్‌జెండర్ దక్కించుకున్నాడన్న విషయాన్ని చాలా గొప్పగా చాటుకున్నారు జియాజహాద్‌ల జంట. జియా గర్భం దాల్చాడనే విషయాన్ని ఫొటో షూట్ చేసి తమ ఇన్‌స్టా అకౌంట్ ద్వారా స్వయంగా ప్రకంటించారు. ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇద్దరూ తల్లిదండ్రులపై ఒక కొత్త శకానికి నాంది పలికారు.