సీబీఐలో అలోక్ మార్క్ : బదిలీలు రద్దు

  • Publish Date - January 10, 2019 / 09:13 AM IST

ఢిల్లీ : సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ డైరెక్టర్ గా మరోసారి బాధ్యతలు చేపట్టిన ఆలోక్‌ వర్మ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాత్కాలిక సీబీఐ డైరెక్టర్ గా నాగేశ్వరరావు చేసిన అధికారుల బదిలీలను రద్దు చేశారు. అక్టోబర్‌ 24 నుంచి జనవరి 8 వరకు జరిగిన బదిలీలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.
అలోక్ వర్మపై వివాదం..సీబీఐలో డైరెక్టర్‌ గా ఉన్న ఆలోక్‌ వర్మ, ప్రత్యేక డైరెక్టర్‌ గా ఉన్న రాకేశ్‌ అస్థానాల మధ్య తలెత్తిన విభేదాల క్రమంలో కేంద్ర ప్రభుత్వం వారిద్దరిని బలవంతపు సెలవుపై పంపిన సంగతి తెలిసిందే. ఆపై వెంటనే ఒడిశా క్యాడర్‌ అధికారి ఎం.నాగేశ్వరరావును తాత్కాలిక డైరెక్టర్‌ గా నియమించారు.

ఆయన బాధ్యతలు చేపట్టిన వెంటనే సీబీఐలోని పలువురు అధికారులను బదిలీ చేశారు.ఇప్పుడా బదిలీలను అలోక్ వర్మ నిలిపివేయడం విశేషం. బలవంతపు సెలవు వేటుకు గురైన అలోక్ వర్మ తనకు న్యాయం చేయాలంటు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు కూడా అలోక్ వర్మను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశాలతో విధుల్లో చేరిన ఆయన.. ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో సీబీఐలోనే మరోసారి గ్రూప్ పాలిటిక్స్ ఏ విధంగా ఉన్నాయో స్పష్టం అయ్యింది.

ట్రెండింగ్ వార్తలు