Tremors felt in Delhi-NCR, parts of north India and Chennai
Tremors felt in Delhi-Chennai: ఢిల్లీ, చెన్నైలో ఇవాళ భూప్రకంపనలు సంభవించాయి. చెన్నైలోని అన్నా మౌంట్ రోడ్, ఈరోడ్, అన్నశాలై ప్రాంతాల్లో భూప్రకంపనలు రావడంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. మరి కొన్ని ప్రాంతాల్లోనూ స్వల్పంగా భూప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 1.35 గంటలకు ప్రకంపనలు సంభవించాయి.
అయితే, మెట్రో నిర్మాణ పనుల వల్ల ప్రకంపనలు వచ్చినట్లు కొందరు చెబుతున్నారు. మెట్రో అధికారులు మాత్రం ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతం మెట్రో పనులు జరగడం లేదని చెప్పారు. మరోవైపు, నేపాల్ లో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేపాల్ లోని జమ్లాకు 69 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతున భూకంపకేంద్రం ఉందని అధికారులు చెప్పారు.
భూప్రకంపనలు రావడంతో అక్కడి ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. అలాగే, ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో భూప్రకంపనలు సంభవించాయి. నేపాల్ లో భూకంప ప్రభావంతో ఉత్తర భారత్ లోని మరికొన్ని ప్రాంతాల్లోనూ స్వల్పస్థాయి భూప్రకంపనలు సంభవించాయి.
Mallikarjun Kharge: 100 మంది మోదీలు, అమిత్ షాలు వచ్చినా ఇక కాంగ్రెస్ గెలుపును ఆపలేరట