Delhi MCD Mayor Election: ఢిల్లీ మేయర్ గా షెల్లీ ఒబెరాయ్.. ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం 

ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. 150 ఓట్లతో ఢిల్లీ మేయర్ గా ఆప్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ గెలుపొందారు. రెండు గంటలపాటు ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. ఓటింగ్ లో 10 మంది నామినేటెడ్ ఎంపీలు, 14 మంది నామినేటెడ్ ఎమ్మెల్యేలు, 241 మంది కౌన్సిలర్లు పాల్గొన్నారు. 265 ఓట్లలో 150 ఓట్లు షెల్లీ ఒబెరాయ్ కు పడ్డాయి.

Delhi MCD Mayor Election: ఢిల్లీ మేయర్ గా షెల్లీ ఒబెరాయ్.. ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం 

Delhi MCD Mayor Election

Delhi MCD Mayor Election: ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. 150 ఓట్లతో ఢిల్లీ మేయర్ గా ఆప్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ గెలుపొందారు. రెండు గంటలపాటు ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. ఓటింగ్ లో 10 మంది నామినేటెడ్ ఎంపీలు, 14 మంది నామినేటెడ్ ఎమ్మెల్యేలు, 241 మంది కౌన్సిలర్లు పాల్గొన్నారు. 265 ఓట్లలో 150 ఓట్లు షెల్లీ ఒబెరాయ్ కు పడ్డాయి.

తమ పార్టీ మేయర్ అభ్యర్ధి షెల్లీ ఓబరాయ్ విజయం సాధించినట్లు డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియీ ట్వీట్ చేశారు. గూండాలు ఓడిపోయారని, ప్రజలు గెలిచారని అన్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ మేయర్‌గా ఎన్నికయ్యేందుకు కృషి చేసిన కార్యకర్తలందరికీ అభినందనలు చెప్పారు.

ఢిల్లీ ప్రజలకు మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. షెల్లీ ఒబెరాయ్ స్పందిస్తూ… ఈ సభను రాజ్యాంగబద్ధంగా నిర్వహిస్తానని అందరికీ హామీ ఇస్తున్నానని చెప్పారు. ఢిల్లీ కౌన్సిలర్లు అందరూ సభ గౌరవాన్ని కాపాడతారని, సజావుగా జరిగేందుకు సహకరిస్తారని ఆశిస్తున్నానని అన్నారు.

Neha Singh Rathore: భోజ్‌పురి గాయనికి షాకిచ్చిన యూపీ పోలీసులు.. పాటలో రాష్ట్రాన్ని విమర్శించారంటూ నోటీసులు