Sirisha Bandla: భుజంపై త్రివర్ణ పతాక బ్యాడ్జ్‌తో అంతరిక్షంలోకి శిరీష!

రిచర్డ్ బ్రెన్సన్ వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ ఫైట్‌లో తెలుగమ్మాయి, గుంటూరు అమ్మాయి రోదసిలోకి వెళ్లింది.

Sireesha

Tricolor patch on the space suit: రిచర్డ్ బ్రెన్సన్ వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ ఫైట్‌లో తెలుగమ్మాయి, గుంటూరు అమ్మాయి రోదసిలోకి వెళ్లింది. నాలుగు నిమిషాలు మాత్రమే అంతరిక్షంలో ఉన్నా కూడా.. ఈ సమయంలో దేశానికి గౌరవం వచ్చేలా ప్రవర్తించింది.

ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము అంటూ మన తెలుగు కవి రాయప్రోలు సుబ్బారావు రాసినట్లు.. ఏ దేశమో కాదు.. వేరే ప్రపంచమేగినా భారతమాత త్రివర్ణ పతాకాన్ని మరిచిపోలేదు మన తెలుగమ్మాయి బండ్ల శిరీష.

తొలిసారి రోదసిలోకి అడుగుపెట్టిన తెలుగమ్మాయి శిరీష.. బండ్ల అంతరిక్షంలోకి వెళ్లిన సమయంలో స్పేస్ స్యూట్‌పై త్రివర్ణ పతాకపు బ్యాడ్జ్‌ను పెట్టుకున్నారు.

అమెరికాలోని హ్యూస్టన్‌లో స్థిరపడినా కూడా భారతీయురాలు అనిపించుకునేందుకు బ్యాడ్జ్ పెట్టుకోవడంతో నెటిజన్లు గర్వంగా ఉందంటూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. వాస్తవానికి శిరీష  భారతీయ మూలాలు ఉన్న అమ్మాయే. అయినా మన దేశంపై గౌరవాన్ని చాటుకుంది అంటూ ప్రశంసిస్తున్నారు నెటిజన్లు.