Tripura CM Manik Saha : బాలుడికి డెంటల్ సర్జరీ చేసిన త్రిపుర సీఎం, ‘గ్యాప్ వచ్చినా బాగానే చేసా’నంటున్న డాక్టర్ సీఎం

త్రిపుర సీఎం మాణిక్ సాహ ఓ బాలుడికి డెంటల్ సర్జరీ చేశారు. చాలా గ్యాప్ తరువాత సర్జరీ చేశానని అయినా ఎటువంటి సమస్యలేదని బాలుడు పరిస్థితి బాగానే ఉందని తెలిపారు.

Tripura CM Manik Saha did dental surgery on 10 year old boy

Tripura CM Manik Saha : త్రిపుర సీఎం మాణిక్ సాహ ఓ బాలుడికి డెంటల్ సర్జరీ చేశారు. మాణిక్ సాహ వృత్తి రీత్యా డెంటల్ డాక్టర్. రాజకీయాల్లోకి వచ్చిన మాణిక్ సాహా సీఎం కూడా అయ్యారు. ఈక్రమంలో తాను ప్రొఫెసర్ గా విధులు నిర్వహించిన హపానియాలోని కాలేజీలోనే 10 ఏళ్ల బాలుడికి తానే స్వయంగా డెంటల్ సర్జరీ చేశారు. తాను సర్జరీ చేసిన ఫోటోలను సీఎం తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన చాలా గ్యాప్ తరువాత సర్జరీ చేశానని అయినా ఎటువంటి సమస్యలేదని బాలుడు పరిస్థితి బాగానే ఉంది అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు. నేను గతంలో పనిచేసిన త్రిపుర మెడికల్ కళాశాలలో.. పదేళ్ల అక్షిత్ ఘోష్ అనే బాలుడికి ఓరల్ సిస్టిక్ లెషన్ సర్జరీ చేయటం గత రోజుల్ని గుర్తు చేసిందన్నారు. చాలా గ్యాప్ తరువాత సర్జరీ చేసినా, ఎలాంటి ఇబ్బంది అనిపించలేదని..పేషెంట్ ఆరోగ్యం బాగుందని అంటూ అని మాణిక్ సాహ ట్వీట్ లో వెల్లడించారు.

2022 మేలో త్రిపుర సీఎంగా మాణిక్ సాహ అధికారం చేపట్టిన మాణిక్ సాహ రాజకీయాల్లోకి రాకముందు మాణిక సాహ త్రిపుర మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ గా పనిచేసేవారు. ఉదయం 9 గంటలకు సర్జరీ రూమ్ కు వచ్చిన డాక్టర్ సాహ అరగంట సర్జరీ చేశారు. ఆయనకు కొంతమంది డాక్టర్ల బృందం సర్జరీలో సహాయంగా ఉన్నారు.