Sri vari Dhana Prasadam : తిరుమలలో శ్రీవారి ధన ప్రసాదం

తిరుమల తిరుపతి దేవస్థానం మరో కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. శ్రీవారి హుండీలో కానుకల రూపంలో భక్తులు సమర్పించే చిల్లర నాణేలను 'ధన ప్రసాదం' రూపంలో భక్తులకే ఇవ్వాలని నిర్ణయించింది.

Sri vari Dhana Prasadam

Sri vari Dhana Prasadam : తిరుమల తిరుపతి దేవస్థానం మరో కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. శ్రీవారి హుండీలో కానుకల రూపంలో భక్తులు సమర్పించే చిల్లర నాణేలను ‘ధన ప్రసాదం’ రూపంలో భక్తులకే ఇవ్వాలని నిర్ణయించింది. సాదారణంగా తిరుమల దర్శించిన భక్తులు అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని తెచ్చుకుంటూ ఉంటారు. ఇప్పడు టీటీడీ శ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకల్లోని చిల్లర (కాయిన్స్) ను శ్రీవారి ప్రసాదం పేరుతో అందచేస్తోంది.

ప్రతిరోజు స్వామివారి హుండీలో సుమారు 20 లక్షల వరకు చిల్లర నాణేలు వస్తుంటాయి. ఈ చిల్లరను తీసుకునేందుకు బ్యాంకులు కూడా ముందుకు రావడం లేదు. దీంతో, టీటీడీ వద్ద చిల్లర నాణేల నిల్వలు పెరిగిపోయాయి. అందుకే ఈ నాణేలను నోట్లుగా మార్చుకునేందుకు టీటీడీ ధన ప్రసాదం కార్యాక్రమాన్ని తీసుకొచ్చింది. తిరుమలలో కాటేజీ బుకింగ్  ఎంక్వైరీ కేంద్రాల వద్ద ధన ప్రసాదం పేరుతో నాణేలను 100 రూపాయల పాకెట్ల రూపంలో కవర్లలో అందిస్తోంది.

TTD : సంప్రదాయ భోజనంపై వైవీ అయిష్టత, టీటీడీ పాలకమండలి నిర్ణయం కాదు

భక్తులు వసతి కోసం కాటేజి బుకింగ్ చేసుకునే సమయంలో చెల్లించిన కాషన్ డిపాజిట్ ను, శ్రీవారి ధన ప్రసాదం రూపంలో తిరిగి చెల్లించేలా ఈ ధన ప్రసాదం కార్యక్రమాన్ని రూపోందించింది. ఈ రోజు నుంచి ప్రారంభించిన కార్యక్రమంలో ప్రస్తుతం ఒక రూపాయి నాణేలను ఇస్తున్నారు. రానున్న రోజుల్లో 2, 5 రూపాయల నాణేలను కూడా టీటీడీ ఇవ్వబోతోంది. ఒకవేళ చిల్లర తీసుకునేందుకు భక్తులు ఆసక్తి చూపకపోతే నోట్ల రూపంలో కాషన్ డిపాజిట్ ను భక్తులకు చెల్లించనున్నారు.