TTD : సంప్రదాయ భోజనంపై వైవీ అయిష్టత, టీటీడీ పాలకమండలి నిర్ణయం కాదు

తిరుమలలో సాంప్రదాయ భోజనంపై టీటీడీ (TTD) ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అయిష్టత వ్యక్తం చేశారు. సాంప్రదాయ భోజనం పేరిట ధర నిర్ణయించడం సరికాదన్నారు.

TTD : సంప్రదాయ భోజనంపై వైవీ అయిష్టత, టీటీడీ పాలకమండలి నిర్ణయం కాదు

Yv

Sampradaya Bhojanam : తిరుమలలో సంప్రదాయ భోజనంపై టీటీడీ (TTD) ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అయిష్టత వ్యక్తం చేశారు. ఇటీవలే..అక్కడ సంప్రదాయ భోజనం ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 2021, ఆగస్టు 26వ తేదీ గురువారం అన్నమయ్య భవన్ లో కొందరికి ఈ భోజనం అందించారు. దీనిపై వైవీ స్పందించారు.

Read More : Hyderabad : తండ్రి మరణాన్ని తట్టుకోలేక కొడుకు ఆత్మహత్య.

తిరుమలలో భక్తులకు ఏదీ ఇచ్చినా ప్రసాదం గానే ఇవ్వాలి..గానీ..సంప్రదాయ భోజనం పేరిట ధర నిర్ణయించడం సరికాదన్నారు. ఈ నిర్ణయం టీటీడీ పాలక మండలి తీసుకుందని కాదని స్పష్టం చేశారు. అధికారుల నిర్ణయం తీసుకున్నారని వారితో మాట్లాడి సంప్రదాయ భోజన కార్యక్రమాన్ని విరమిస్తామన్నారు.

Read More : YSR : వైఎస్ వర్ధంతి..విజయమ్మ ప్రత్యేక సమావేశం..షర్మిల కోసమేనా ?

ఇక భక్తులకు శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా…శ్రీ కృష్ణుడికి ఎంతో ఇష్టమైన నవనీత సేవను నేటి నుంచి శ్రీవారి ఆలయంలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉచిత దర్శనంపై జిల్లా అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కొంతమంది భక్తులకు అయినా.. ఉచిత దర్శనానికి అనుమతిచ్చేలా త్వరలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు టీటీడీ చైర్మన్ వై వీ సుబ్బారెడ్డి.

Read More : Cannabis : హైదరాబాద్‌లో రూ.21 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

దేశీయ ఆవుల ఎరువుతో పండించిన పంటలతో సంప్రదాయ భోజనం తయారు చేశారు. కులంకార్ బియ్యంతో ఇడ్లీలు, కాలాబాత్ బియ్యంతో ఉప్మా తయారు చేశారు. అన్నం, కొబ్బరి అన్నం, పులిహోరా, బోండా, ఉప్మా, ఇడ్లీ, పప్పు, సాంబారు, రసం, పూర్ణాలు, పచ్చడి, పెరుగు, నెయ్యి మొత్తం 14 రకాల ఆహార పదార్థాలున్నాయి. వీటిని తినడం వల్ల వ్యాధి నిరోధకతో పాటు సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉంటాయన్నారు అధికారులు.