Cannabis : హైదరాబాద్‌లో రూ.21 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

హైదరాబాద్‌లో భారీగా గంజాయి పట్టుబడింది. ఔటర్ రింగ్ రోడ్డు వద్ద సుమారు రూ.21 కోట్ల విలువ చేసే 3,400 కిలోల గంజాయిని ఎన్‌సీబీ అధికారులు పట్టుకున్నారు. 24 సంచుల్లో గంజాయి గుర్తించారు.

Cannabis : హైదరాబాద్‌లో రూ.21 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

Cannabis (1)

cannabis seized in Hyderabad : హైదరాబాద్‌లో భారీగా గంజాయి పట్టుబడింది. ఔటర్ రింగ్ రోడ్డు వద్ద సుమారు రూ.21 కోట్ల విలువ చేసే 3,400 కిలోల గంజాయిని ఎన్‌సీబీ అధికారులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో ఎన్‌సీబీ అధికారులు ఔటర్ రింగ్ రోడ్డుపై  ట్రక్కులో సొదాలు చేశారు.

వెహికిల్ లోని పూల మొక్కల చాటున 24 సంచుల్లో గంజాయి ఉన్నట్టు గుర్తించారు. గంజాయితో పాటు మహారాష్ట్రకు చెందిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ ఏజెన్సీ నుంచి ముంబయికి గంజాయి తరలిస్తున్నట్టు గుర్తించారు.

ఈ ఏడాది ఇప్పటివరకు ఎన్‌సీబీ అధికారులు 7,500 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే 25 మందిని అరెస్టు చేశారు.