McDonald India మెనూలో కొత్త ఐటమ్స్.. పసుపు పాలు, మసాలా కడక్‌ చాయ్!

మెక్‌డొనాల్డ్స్ ఇండియా గత కొన్ని ఏళ్లుగా ఫుడ్ మెనూలో మార్పులు చేస్తోంది. సమెక్‌డొనాల్డ్స్ ఇండియా మెక్కేఫ్ మెనూలో రెండు కొత్త రోగనిరోధక శక్తిని పెంచే పానీయాలను చేర్చింది.

Turmeric Latte & Masala Kadak Chai: మెక్‌డొనాల్డ్స్ ఇండియా (McDonald India) గత కొన్ని సంవత్సరాలుగా ఫుడ్ మెనూలో మార్పులు చేస్తోంది. సరికొత్త ఫుడ్ ఐటమ్స్ మెనూలో చేర్చుతూ కస్టమర్లను ఆకర్షిస్తోంది. ప్రత్యేకించి భారతీయ కస్టమర్లను ఆకట్టుకునేందుకు వారి అభిరుచికి తగినట్టుగా వంటకాలతో అదరగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే చాలా వంటకాలతో భారతీయ కస్టమర్లను సంతృప్తిపరిచిన మెక్ డొనాల్డ్స్ ఇండియా తమ మెనూలో చేర్చిన అన్ని వంటకాలు కస్టమర్లను అభిరుచికి తగినట్టుగా ఎక్కువకాలం కొనసాగలేదు. మళ్లీ తమ వినియోగదారుల దృష్టిని ఆకర్షించే ప్రయత్నంలో మెక్‌డొనాల్డ్స్ ఇండియా మెక్కేఫ్ మెనూలో రెండు కొత్త రోగనిరోధక శక్తిని పెంచే పానీయాలను తీసుకొస్తోంది.

అందులో ఒక వంటకం టర్మెరిక్ లాట్టే (Turmeric Latte), మసాలా కడక్ చాయ్ (Masala Kadak Chai)లను మెనూలో చేర్చింది. దానా మెకాఫీ మెనూలో పసుపు పాలు, మసాలా కడక్ చాయ్ రెండు ప్రొడక్టులను చేర్చినట్టు తెలిపింది. అయితే ఈ రెండు ఐటమ్స్.. మెకాఫీ అవుట్ లెట్లలో త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. మెక్‌డొనాల్డ్స్ వెస్ట్ అండ్‌ సౌత్ ఫ్రాంచైజీ హర్డ్‌కాస్లీ రెస్టారెంట్‌లు, మెక్‌డీ మెక్‌అఫీ అవుట్‌లెట్‌లను నిర్వహిస్తున్నాయి. ఈ ఫ్రాంఛైజీ దేశంలోని 42 నగరాల్లో 305 మెక్‌డొనాల్డ్స్‌ రెస్టారెంట్లను నిర్వహిస్తోంది.
Tejashwi Yadav : ఓటర్లకు డబ్బులు పంచుతూ కెమెరాకు చిక్కిన ఆర్జేడీ యువనేత.. వైరల్ వీడియో

ఈ రెస్టారెంట్లలో పసుపుతో కూడిన పాలు ప్రత్యేక ఉత్పత్తి కానుంది. ఆయుర్వేద ఔషధాల తయారీలో పసుపును ఎక్కువగా వినియోగిస్తుంటారు. అందులో ప్రత్యేకించి దగ్గు, జలుబు వంటి అనేక అనారోగ్య సమస్యలకు పసుపు అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలోనూ పసుపు దివ్యౌషధంలా పనిచేస్తుంది.

ఈ ప్రత్యేక పాలలో యాలకులు, సాఫ్రన్‌ వంటి పోషకాలు కలుపనున్నారు. మసాలా కడక్‌ చాయ్‌ భారతీయ కస్టమర్లకు ప్రేమ, భావోద్వేగాన్నిఅందించే పానీయంగా మెక్‌డొనాల్డ్స్‌ తీసుకొస్తోంది. టర్మరిక్‌ పాల ధర రూ.140గా నిర్ణయించగా.. మసాలా కడక్‌ చాయ్‌ ధర రూ.90గా ఉండనుంది. ముందుగా 10 రెస్టారెంట్లలో ఈ పానియాలను మెనూలో చేర్చనుంది. ఆ తర్వాత మిగతా 250 యూనిట్లలో రెండు పానియాలను అందుబాటులోకి తీసుకొస్తామని వెస్టర్న్‌, సదరన్‌ ఇండియా డైరెక్టర్‌ ఆర్వింద్‌ ఆర్పీ వెల్లడించారు.

దాదాపు ప్రతి భారతీయ ఇంటిలోనూ ఏదైనా టీ స్టాల్‌లోనూ కనిపించే పానీయాలు మసాలా కడక్ చాయ్‌కి రూ. 99 ఉండనుంది. పసుపు లాట్టే కోసం రూ .140 ధరగా నిర్ణయించింది. మెక్‌డొనాల్డ్స్ భారతీయ రుచులను అందించేందుకు ప్రయత్నిస్తోంది. భారతీయ వంటకాలు లేదా పానీయాలను మెక్ డొనాల్డ్స్ ప్రవేశపెట్టడం ఇదేం తొలిసారి కాదు. మెక్‌ అలూ టిక్కీ, రైస్ బౌల్స్, పనీర్ ర్యాప్స్ వంటి అనేక ఇతర భారతీయ బర్గర్లు మెక్‌డొనాల్డ్స్ ఇండియా మెనూలో ఎప్పటినుంచో అందుబాటులో ఉన్నాయి.
Skating : 73 ఏళ్ల వయసులో స్కేటింగ్‌.. ఓ సారి ఆయన ప్రతిభ చూడండి

ట్రెండింగ్ వార్తలు