Video: ఎండ వేడి గురించి వార్తలు చదువుతూ అదే వేడికి లైవ్‌లో స్పృహ తప్పిన యాంకరమ్మ

దూరదర్శన్ యాంకర్ లోపాముద్ర సిన్హా లైవ్ న్యూస్ చదువుతోన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఎండ వేడిని తట్టుకోవడానికి మజ్జిగ, నిమ్మరసం తాగాలని, డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకోవాలని చాలా మంది చెబుతుంటారు. ఎన్నో జాగ్రత్తలు చెబుతుంటారు కానీ.. చెప్పేవారే వాటిని పాటించరు. అన్ని విషయాలూ తెలిసినా వాటిని పాటించకుండా ప్రమాదాలు కొనితెచ్చుకుంటారు.

‘జాగ్రత్తలు పాటించాల్సింది నేను కాదు.. ఇతరులు’ అనేలా వ్యవహరిస్తుంటారు. ఇటువంటి ఘటనే పశ్చిమ బెంగాల్లో తాజాగా చోటుచేసుకుంది. రాష్ట్రంలో ఎండలు ఎక్కువగా ఉన్నాయనే వార్త చదువుతూ అదే వేడికి స్పృహ తప్పి పడిపోయింది ఓ యాంకర్. దూరదర్శన్ యాంకర్ లోపాముద్ర సిన్హా లైవ్ న్యూస్ చదువుతోన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Also Read: వంట గ్యాస్ సిలిండర్ వాడుతున్నవారికి శుభవార్త చెప్పిన ప్రభుత్వ చమురు కంపెనీలు

దూరదర్శన్ పశ్చిమ బెంగాల్ శాఖలో ఆమె పనిచేస్తోంది. తన ఆరోగ్య పరిస్థితి గురించి ఆమె తన ఫేస్‌బుక్‌లోనూ వివరాలు తెలిపింది. తనకు అనారోగ్యంగా అనిపించినప్పటికీ వార్తలు చదివానని చెప్పింది. ఒక గ్లాసు నీళ్లు తాగడంతో తనకు అంతా బాగానే ఉన్నట్లు అనిపించిందని వార్తలు చదవగలనని ఆ సమయంలో అనిపించిందని తెలిపింది.

లైవ్ వార్తలు ప్రారంభం కాగానే, ఆమె పరిస్థితి మరింత దిగజారింది. ఉష్ణోగ్రతలకు సంబంధించిన వార్తలు చదవాల్సి రాగానే కళ్లముందు అంతా చీకటి కమ్ముకున్నట్లు ఆమెకు అనిపించింది. చివరకు స్పృహ తప్పి పడిపోయింది.

DC vs SRH : స‌న్‌రైజ‌ర్స్ బ్యాటింగ్ పై ఫ‌న్నీ మీమ్స్‌.. బ్లూ జెర్సీ చూస్తే హెడ్‌కు పూన‌కం

ట్రెండింగ్ వార్తలు