LPG: వంట గ్యాస్ సిలిండర్ వాడుతున్నవారికి శుభవార్త చెప్పిన ప్రభుత్వ చమురు కంపెనీలు

గ్యాస్ డెలివరీ చేయడానికి వచ్చిన సిబ్బంది అదే సమయంలో మొత్తం ఎనిమిది భద్రతా నిబంధనలను దృష్టిలో పెట్టుకుని..

LPG: వంట గ్యాస్ సిలిండర్ వాడుతున్నవారికి శుభవార్త చెప్పిన ప్రభుత్వ చమురు కంపెనీలు

LPG Cylinder

దేశంలోని అన్ని ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్‌లకు ఉచితంగా సేఫ్టీ చెక్ చేయించాలని ప్రభుత్వ చమురు కంపెనీలు నిర్ణయించాయి. ఆయా ఆయిల్ కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లు కలిసి ఈ కార్యక్రమం చేపడుతాయి. గ్యాస్ వినియోగదారుల ఇంటికి సిబ్బంది వెళ్లి గ్యాస్ పని చేస్తున్న తీరు, లీకేజీలు వంటివి చెక్ చేస్తారు.

గ్యాస్‌లో ఏవైనా లోపాలు ఉంటే వాటి గురించి చెబుతారు. అలాగే, కేజీలు, గ్యాస్ కు సంబంధించిన పరికరాలను మార్చుకోవాల్సిన ఆవశ్యకత వంటి అంశాలపై వినియోగదారులకు అవగాహన కల్పిస్తారు. ఈ తనిఖీలు అంతా ఉచితంగా చేస్తారని ప్రబుత్వం చమురు కంపెనీలు ఓ ప్రకటనలో తెలిపాయి.

గ్యాస్ డెలివరీ చేయడానికి వచ్చిన సిబ్బంది అదే సమయంలో మొత్తం ఎనిమిది భద్రతా నిబంధనలను దృష్టిలో పెట్టుకుని, దాన్ని చెక్ చేస్తారని వివరించాయి. అలాగే, అదే ఎనిమిది నిబంధనలపై వినియోగదారులకు వివరించి చెబుతారని తెలిపాయి.

సాధారణంగా ఉండే నిబంధనల ప్రకారం ప్రతి వినియోగదారుడు ఐదేళ్లకు ఓ సారి తప్పనిసరిగా గ్యాస్ ఇన్‌స్టాలేషన్, పరికరాలకు సంబంధించి డబ్బులు ఇచ్చి చెక్ చేయించుకోవాలి. ఇందుకు రూ.200తో పాటు 18 శాతం జీఎస్టీ కట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం చేయనున్న తనిఖీ మాత్రం పూర్తిగా ఉచితం.

Gold Rate : పది రోజుల్లో గోల్డ్ రేటు ఎంత పెరిగిందో తెలుసా?.. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం తులం బంగారం ధర ఎంతంటే..