Monkeys
Monkeys : కర్ణాటకలో అమానవీయ ఘటన జరిగింది. విషాహారం ఇవ్వడంతో 20కిపైగా కోతులు మృతి చెందాయి. వాటిని గోనె సంచుల్లో కుక్కి కోలార్ హైవే సమీపంలోని అటవీ ప్రాంతంలో పడేశారు. సంచులను గమనించిన స్థానికులు తెరిచి చూశారు.. అప్పటికే కోతులన్నీ మృతి చెంది ఉన్నాయి. దీంతో పోలీసులకు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
Read More : Heroines : ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్న హీరోయిన్స్ వీళ్లే
ఘటన స్థలికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు గోనె సంచులను స్వాధీనం చేసుకున్నారు. విషమిచ్చి వాటిని చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. కోతుల మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామని కోలార్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సెల్వమణి తెలిపారు. కాగా గతంలో కూడా కర్ణాటకలో ఇటువంటి ఘటన చోటుచేసుకుంది. అప్పుడు కూడా 20 కోతులకు విషమిచ్చి చంపారు దుండగులు.
Read More : Uttej Wife : ఏడవకు ఉత్తేజ్.. నీకు మేమున్నాం..