Blue Tik
Venkaiah Naidu Twitter : భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యక్తిగత ఖాతా ఉన్న బ్లూ టిక్ ను ట్విట్టర్ తొలగించడం కలకలం రేపింది. ట్విట్టర్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అత్యున్నతమైన పదవిలో ఉన్న వ్యక్తి విషయంలో ఈ విధంగా జరగడంపై దుమారం రేగింది. అసలు ఎందుకు తొలగించాల్సి వచ్చిందని ఉప రాష్ట్రపతి కార్యాలయం…ట్విట్టర్ యాజమాన్యాన్ని వివరణ కోరింది. దీంతో యాజమాన్యం స్పందించింది. చాలా రోజులుగా వెంకయ్య నాయుడి ట్విట్టర్ అకౌంట్ క్రియాశీలకంగా లేదని, ఈ కారణంతోనే బ్లూ టిక్ ను తొలగించినట్లు ట్విట్టర్ వెల్లడించినట్లు సమాచారం.
వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి అయిన తర్వాత..సమాచారాన్ని అధికారిక ఉప రాష్ట్రపతి కార్యాలయం అకౌంట్ నుంచి పంపుతున్నారని వెల్లడించింది. దీంతో తప్పు జరిగిందని ట్విట్టర్ భావించింది. వెంకయ్యనాయుడు వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ కు బ్లూ టిక్ తిరిగి కల్పించింది. గత సంవత్సరం జులై 23వ తేదీన వెంకయ్య నాయుడు ట్విట్టర్ అకౌంట్ నుంచి ట్వీట్ వచ్చింది. ఈయన అకౌంట్ కు 13 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ట్విట్టర్ తప్పు సరిదిద్దు కోవడంతో వివాదం సద్దుమణిగినట్లైంది.
Read More : ఆధార్ కోసం తిప్పలు