Kerala: తల్లిని తిట్టాడనే కోపంతో బంధువును హతమార్చిన బాలికలు

తల్లిని తిట్టాడనే ఆవేశంలో 70ఏళ్ల వృద్ధుడ్ని హతమార్చారు ఇద్దరు మైనర్ బాలికలు. ఆ తర్వాత స్వయంగా స్టేషన్ కు వెళ్లి లొంగిపోయారు. అంబాలవయాల్ ప్రాంతంలో జరిగిన ఘటనలో బావి నుంచి...

Kerala: తల్లిని తిట్టాడనే కోపంతో బంధువును హతమార్చిన బాలికలు

Stabbed to death

Updated On : December 29, 2021 / 12:08 PM IST

Kerala: తల్లిని తిట్టాడనే ఆవేశంలో 70ఏళ్ల వృద్ధుడ్ని హతమార్చారు ఇద్దరు మైనర్ బాలికలు. ఆ తర్వాత స్వయంగా స్టేషన్ కు వెళ్లి లొంగిపోయారు. అంబాలవయాల్ ప్రాంతంలో జరిగిన ఘటనలో బావి నుంచి ముహమ్మద్ కోయా అనే వ్యక్తి మృతదేహాన్ని రికవరీ చేశారు పోలీసులు.

బాలిక మేనత్త భర్త అయిన ముహమ్మద్ కోయా తల్లిపై దాడి చేయబోతుండగా బాలికలు అడ్డుకున్నారు. పదేపదే అసభ్యపదజాలం వాడుతుండటంతో వద్దని వారించారు. అయినా వినకపోవడంతో గొడ్డలితో అతనిపై దాడి చేశారు.

ఆ తర్వాత వెళ్లిపోలీసులకు విషయం చెప్పి లొంగిపోయారు. మృతుడి కుటుంబం, బాలికల కుటుంబం రెండూ ఒకే ఇంట్లో విడివిడి పోర్షన్లలో నివాసం ఉంటున్నారు. ‘ముహమ్మద్ అనే వ్యక్తితో బాలికలు చాలా రోజులుగా ఇబ్బందిపడుతున్నారు. సుదీర్ఘకాలంగా ఇబ్బందిపడుతున్న వారు దారుణానికి పాల్పడి ఉండొచ్చని’ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ మీడియాతో అన్నారు.

ఇది కూడా చదవండి: యువతకు ప్రేరణగా ఉండాలని రొనాల్డ్ విగ్రహం