Two Teachers Get 3 Years In Jail For Beating 5 Year Old Student
Two Teachers Get 3 Years In Jail For Beating 5 year old student : స్కూల్ కు వెళ్లిన పిల్లలు మధ్య మధ్యలో మంచినీళ్లు తాగటానికి..టాయిలెట్ కు వెళ్లటం సర్వసాధారణం. అలా టాయిలెట్ కు వెళ్లిందని ఓ విద్యార్ధినిని టీచర్లు కొట్టారు. అదేమన్నా నేరమా? స్కూల్ కు వచ్చినవారు మంచినీళ్లు తాగటం..టాయిలెట్ కు వెళ్లటం చేయటం ఘోరమా? విద్యార్ధుల పట్ల ఇలాగేనా వ్యవహరించేది? అని చీవాట్లు పెట్టిన న్యాయస్థానం సదరు టీచర్లకు మూడేళ్ల జైలుశిక్ష విధించిన ఘటన గుజరాత్ లో జరిగింది. గుజరాత్ లోని మిర్జాపూర్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు టాయిలెట్ కు వెళ్లినందుకు విద్యార్ధినిని కొట్టిన ఇద్దరు టీచర్లకు జైలుశిక్ష విధిస్తు తీర్పునిచ్చింది.
అమ్మదాబాద్ లోని మకర్భా అర్జున్ ప్రాథమిక స్కూల్లో ఐదేళ్ల విద్యార్ధిని చదువుతోంది. ఓ రోజు ఇంటికి వెళ్లి తర్వాత ఆ చిన్నారి తనను టీచర్లు కాళ్లపై తీవ్రంగా కొట్టారని..గెంటేశారు అని తల్లితో చెప్పి ఏడ్చింది.టీచర్ కొట్టిన దెబ్బలకు కాళ్లపై వాతలు తేలాయి. ఆ గాయాలు చూసిన తల్లికి బాధవేసింది. ఆగ్రహం వచ్చింది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసు మిర్జాపూర్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు కు విచారణకు వచ్చింది.
Also read : Russia-ukraine war : యుక్రెయిన్‌లో కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యం..చనిపోయిన యజమాని వద్దనుంచి కదలని కుక్క
నీళ్లు తాగేందుకు వెళ్లాలని, టాయిలెట్ అని, బ్రేక్ ఫాస్ట్ కోసమని ఇలా పదే పదే బయటకు వెళ్లటానికి పర్మిషన్ అడుగుతున్నాడని ఆగ్రహించిన ఇద్దరు టీచర్లు ఆ చిన్నారిని దారుణంగా కొట్టారు. వాతలు తేలేలా కొట్టారు. ఆ గాయలను అమ్మానాన్నలకు చూపించగా తల్లిదండ్రుల ఆగ్రహం..ఆవేదన వ్యక్తం చేస్తూ.. సర్ఖేజ్ పోలీస్ స్టేషన్‌లో జూన్ 22, 2017న ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు టీచర్లు తరుణ పర్బతియా (36), నజ్మా షేక్ (47)పై పోలీసులు కేసు నమోదు చేశారు.
వాదనలు విన్న తరువాత వేర్వేరు సెక్షన్ల కింద టీచర్లు ఇద్దరికీ మూడేళ్ల జైలు శిక్ష రూ.10,000వేలు జరిమానా విధిస్తూ మేజిస్ట్రేట్ తీర్పు చెప్పారు. టీచర్లపై క్రమశిక్షణ చర్యలకు కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణలో భాగంగా టీచర్లు నీళ్లు తాగేందుకు వెళ్లాలని, టాయిలెట్ అని, బ్రేక్ ఫాస్ట్ కోసమని పాఠాలు వినకుండా ఇలా పదే పదే బయటకు వెళ్లటానికి పర్మిషన్ అడుగుతోందని అందుకే భయం చెప్పటానికి కొట్టామని తెలిపారు. కోర్టు మాత్రం టీచర్లకు చీవాట్లు పెట్టింది. స్కూల్లో మంచినీళ్లు తాగటం..టాయిలెట్ కు వెళ్లటం నేరమా? అని తీవ్రంగా ప్రశ్నించింది. అంతమాత్రానికే దారుణంగా కొడతారా? అంటూ చీవాట్లు వేసింది.