Vande Bharat Express (Photo : Google)
Vande Bharat Express : వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు తృటిలో ప్రమాదం తప్పింది. ట్రైన్ ఆపరేటర్లు అప్రమత్తంగా కావడంతో పెను ప్రమాదమే తప్పినట్లు అయ్యింది. ప్రమాదాన్ని గుర్తించిన ట్రైన్ ఆపరేటర్లు ఏ మాత్రం ఆలోచన చేయలేదు. వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేశారు. దాంతో ట్రైన్ నిలిపోయి ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
ఉదయ్ పూర్-జైపూర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ లోకోమోటివ్ పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ప్రమాదాన్ని గమనించిన పైలట్లు.. వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేసి ట్రైన్ ను నిలిపివేశారు. అసలేం జరిగిందంటే.. రైలు పట్టాలపై రాళ్లు, రాడ్లు ఉండటాన్ని లోకోమోటివ్ పైలెట్లు గమనించారు. రైలు పట్టాలపై అటు ఇటు కొంతదూరం వరకు రాళ్లు పెట్టి ఉన్నాయి. అలాగే ఇనుప కడ్డీలు ఉంచారు. రైలుని ఆపి కిందకు దిగిన సిబ్బంది.. పట్టాలపై ఉంచిన రాళ్లు, రాడ్లను పక్కకు జరిపేశారు. కాసేపటి తర్వాత ట్రైన్ బయలుదేరింది.
గంగరార్-సోనియాన సెక్షన్ లో ఉదయం 9.55 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. దీనిపై రైల్వే పోలీసులు, స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. ఇది ఆకతాయిల పనా? లేక ఎవరైనా కావాలనే చేశారా? అన్న కోణంలో విచారిస్తున్నారు. చూస్తుంటే ఎవరో కావాలనే పట్టాలపై రాళ్లు పేర్చి, అక్కడక్కడ ఇనుప కడ్డీలు కూడా ఉంచినట్లుగా అనుమానం వ్యక్తమవుతోంది. వారి ఉద్దేశ్యం ఏంటో అర్థం కావడం లేదు.
రైలు ట్రాక్ పై రాళ్లు, రాడ్ లు ఉంచడం కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయం తెలుసుకుని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. పెద్ద ప్రమాదమే తప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. లోకోమోటివ్ పైలెట్లు అప్రమత్తంగా వ్యవహరించడం వల్లే ఘోరం తప్పిందని, లేకుంటే ఊహించని ప్రమాదం జరిగి ఉండేదని చెబుతున్నారు.
రైలు ప్రమాదానికి గురయ్యేలా కొందరు దుండగులు కుట్ర చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. రైలు పట్టాలపై రాళ్లు పెట్టడం, ఆ రాళ్లు పడిపోకుండా రాడ్లు పెట్టడం.. ఇవన్నీ చూస్తుంటే రైలు పట్టాలు తప్పేలా ఇదంతా చేసి ఉండొచ్చని అంటున్నారు. అయితే లోకోమోటివ్ పైలెట్లు సరైన సమయానికి గుర్తించడంతో ప్రమాదం తప్పినట్లు అయ్యింది. ఈ పని ఎవరు చేశారో తెలుసుకోవాలని, వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులను పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.
ఉదయ్ పూర్-జైపూర్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ వారానికి ఆరు రోజులు నడుస్తుంది. మంగళవారం సర్వీస్ ఉండదు. ప్రతి ఉదయం 7.50 గంటలకు ఉదయ్ పూర్ సిటీ నుంచి బయలుదేరుతుంది. మధ్యాహ్నం 2గంటల 5 నిమిషాలకు జైపూర్ చేరుకుంటుంది.
This could have been disastrous !!
Well Planned Derailment of Udaipur – Jaipur Vande Bharat Express near Bhilwara.When hate towards a particular political party changes into hate towards nation this is the result, God bless people with such mentality#VandeBharatExpress pic.twitter.com/NzkOCtJNNu
— Saurabh • A Railfan ?? (@trains_of_india) October 2, 2023