Uddav
Uddhav Thackeray: మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీని అన్ని విధాలుగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని శివసేన అధ్యక్షుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే పార్టీ కార్యకర్తలకు సూచించారు. “శివసేనను కించపరిచే ప్రతిపక్ష నేతల అన్ని ప్రయత్నాలను నాశనం చేయాలని” ఉద్ధవ్ తన సేనలకు పిలుపునిచ్చారు. ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ హిందుత్వన్నీ అవకాశంగా మలుచుకుంటుందని ఆయన ఆరోపించారు. అసలైన హిందుత్వం అంటే ఏమిటో మనం వారికి చూపించాలని ఉద్ధవ్ వ్యాఖ్యానించారు.
అసలైన హిందుత్వం మహారాష్ట్రలో ఉందని..తమ ప్రభుత్వం హిందుత్వాన్ని కాపాడడంలో ఎలా కృషిచేస్తుందో తెలిసేలా రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు చేరేలా కార్యకర్తలు కృషిచేయాలని ఉద్దవ్ పేర్కొన్నారు. తాను కూడా త్వరలో రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో పర్యటిస్తానని ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. “కేవలం విధానసభ మరియు లోక్‌సభ గురించి ఆలోచించడమే కాదు..పంచాయితీల నుండి పార్లమెంటు వరకు శివసేన సిద్ధంగా ఉండాలని ఉద్దవ్ అన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో బీజేపీ గెలిచిన అన్ని స్థానాల్లోనూ పెద్దఎత్తున ప్రచారాలు నిర్వహించాలని ఉద్ధవ్ తన కార్యకర్తలకు సూచించారు. హిందువులు ప్రమాదంలో ఉన్నారని బీజేపీ నేతలు ఉత్తరప్రదేశ్ లో అపనమ్మకం సృష్టించారని..అటువంటి ప్రయత్నాలను మహారాష్ట్రలో తిప్పికొట్టేలా బీజేపీని ఎదుర్కోవాలని ఠాక్రే అన్నారు.
Also read: Telangana : నేతల భేటీపై అధిష్టానం సీరియస్.. సీనియర్లకు ఫోన్