Telangana : నేతల భేటీపై అధిష్టానం సీరియస్.. సీనియర్లకు ఫోన్

టీ కాంగ్రెస్ సీనియర్లకు ఏఐసీసీ కార్యదర్శి బోస్ రోజు ఫోన్ చేశారు. సమావేశం వెంటనే రద్దు చేసుకోవాలని సూచించారు. సమస్య ఉంటే నేరుగా సోనియా, రాహుల్ కు చెప్పాలని, సమావేశాలు పెట్టి పార్టీన

Telangana : నేతల భేటీపై అధిష్టానం సీరియస్.. సీనియర్లకు ఫోన్

T.congress

Updated On : March 20, 2022 / 11:05 AM IST

Telangana Congress Seniority : తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత విబేధాలు పొడచూపుతున్నాయి. హస్తం పార్టీలో అసమ్మతి రాగాలు పెరుగుతుడడంతో సీనియర్లు అలర్ట్ అయ్యారు. తక్షణమే సమావేశం కావాలని.. ఓ కార్యచరణ సిద్ధం చేయాలని వారు నిర్ణయించడం పార్టీలో హాట్ టాపిక్ అయ్యింది. సమావేశానికి హాజరవుతున్న వారంతా… టీపీసీసీ నాయకత్వంపై అసంతృప్తి ఉన్న నేతలు మాత్రమే ఉండడం గమనార్హం. ఈ సమావేశం విషయం తెలుసుకున్న కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయ్యింది. టీ కాంగ్రెస్ సీనియర్లకు ఏఐసీసీ కార్యదర్శి బోస్ రోజు ఫోన్ చేశారు. సమావేశం వెంటనే రద్దు చేసుకోవాలని సూచించారు. సమస్య ఉంటే నేరుగా సోనియా, రాహుల్ కు చెప్పాలని, సమావేశాలు పెట్టి పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టొద్దని సూచించారు. ఒకవేళ సమావేశం నిర్వహిస్తే.. తీవ్రమైన పరిగణించాల్సి వస్తుందని బోస్ రాజు తెలిపారు.

Read More : Sonia Gandhi : కాంగ్రెస్‌‌కు పూర్వవైభవం తెచ్చేలా.. సోనియా కీలక నిర్ణయాలు

అశోక హోటల్ లో ఈ సమావేశం నిర్వహించారు. స్వయంగా.. వీహెచ్ కొంతమంది సీనియర్లకు ఫోన్లు చేశారు. ఈ భేటీకి రావాలంటూ.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని.. ఇంటికి వెళ్లి మరీ కాంగ్రెస్‌ సీనియర్ నేత వీహెచ్‌ ఆహ్వానించారు. కాంగ్రెస్‌ నేతలు జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డి సహా పలువురు సీనియర్ నేతలకు ఆహ్వానాలు అందాయి. తొలుత కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వీహచ్ కు ఫోన్ చేశారు. సమావేశం వద్దంటూ కోరారు. అయినా.. సమావేశం పెట్టి నిర్వహిస్తానని వీహెచ్ ఖరాఖండిగా చెప్పినట్లు సమాచారం. దీంతో సీనియర్లపై అధిష్టానం గుర్రుగా ఉంది. అందులో భాగంగా ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజు జోక్యం చేసుకున్నారు. . గత కొంతకాలంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై గుర్రుగా ఉన్న నేతలు రహాస్య భేటీలు నిర్వహిస్తున్నారు.

Read More : Telangana Corona News : తెలంగాణలో తగ్గిన కరోనా.. 17 జిల్లాల్లో సున్నా కేసులు

రేవంత్‌ పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. సమయం దొరికిన ప్రతిసారి ఆయనపై అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని చక్కదిద్దేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే మరోసారి ఆదివారం సమావేశం కావాలని నిర్ణయించారు పార్టీ సీనియర్లు. పీపీసీ వ్యవహారంపై కాంగ్రెస్‌ అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని డిసైడ్‌ అయ్యారు. ఈ నెల 22న ఢిల్లీకి వెళ్లి.. అధిష్టానం వద్ద పీసీసీ తీరును ఎండగట్టాలని సీనియర్లు భావిస్తున్నారు. మరి బోస్ రాజు చేసిన సూచనలు, హెచ్చరికలతో సీనియర్లు మెత్తబడుతారా ? లేదా ? అనేది