Aadhar
UIDAI Scam: ఆధార్ జారీ చేసే సంస్థ “యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా” (UIDAI) కొన్ని మొబైల్ కంపెనీలకు లబ్ధి చేకూర్చే విధంగా తీసుకున్న నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వానికి రూ. 13,205 కోట్ల ఆదాయాన్ని కోల్పోయేలా చేసింది. కంప్ట్రోలర్ ఆడిట్ జనరల్ కాగ్ ఇటీవల పార్లమెంట్‌లో సమర్పించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. CAG నివేదిక ప్రకారం, UIDAI, దాని సొంత నిబంధనలకు విరుద్ధంగా, టెలికాం ఆపరేటర్లకు (మొబైల్ కంపెనీలు) మరియు బ్యాంకులకు వేల కోట్ల విలువైన ధృవీకరణ సేవ మరియు yes/no ధృవీకరణ సేవను ఉచితంగా పంపిణీ చేసినట్లు వెల్లడైంది. దీని వల్ల ప్రభుత్వానికి దాదాపు 13,205 కోట్ల నష్టం వాటిల్లింది. రెండు సేవలకు సంబంధించి 3 వేల కోట్లకు పైగా లావాదేవీలు ఉచితంగా జరిగినట్లు కాగ్ నివేదించింది. ఈ సేవలను ఉచితంగా అందించాలని ప్రభుత్వం ఎప్పుడూ కోరుకోలేదని కూడా కాగ్ పేర్కొంది.
కొన్ని మొబైల్ కంపెనీలకు నేరుగా లబ్ధి చేకూర్చేందుకు UIDAI ఉద్దేశపూర్వకంగానే ఈ జాప్యాన్ని తీసుకుందని అధికారిక వర్గాలు తెలిపాయి. 2008లో బొగ్గు కుంభకోణం మరియు 2G స్కాం తరువాత “పొటెన్షియల్ లాస్” అనే భావనను తొలిసారిగా ప్రవేశపెట్టారు. ప్రస్తుత స్కామ్ సమయంలో అది తెరపైకి వచ్చింది. కాగ్ నివేదికల ద్వారానే ఆయా కుంభకోణాలు కూడా బయటపడ్డాయి.
UIDAI వల్ల నష్టం ఎలా జరిగింది:
మన బ్యాంక్ ఖాతా లేదా మొబైల్ నంబర్.. ఆధార్ కార్డ్‌కి లింక్ చేయబడి ఉందనుకోండి..మొబైల్ కంపెనీ లేదా బ్యాంక్ E-KYC చేసినప్పుడు, ఆధార్ నంబర్ అవసరం. దీన్ని ప్రమాణీకరణ సేవ అంటారు. ప్రతి ధృవీకరణ కోసం, బ్యాంక్ లేదా మొబైల్ కంపెనీ UIDAIకి రూ.20 రుసుము చెల్లించాలి. అదేవిధంగా, UIDAI నుండి ఆధార్ కార్డ్ హోల్డర్ గురించి ఏదైనా సమాచారాన్ని బ్యాంక్ లేదా మొబైల్ కంపెనీ ధృవీకరించినట్లయితే, దాని సమాధానం YES లేదా NO అని ఇవ్వబడుతుంది. ప్రతి YES / NO ధృవీకరణ కోసం, బ్యాంక్ లేదా మొబైల్ కంపెనీ రుసుముగా 50 పైసలు చెల్లించాలి. అయితే UIDAI ఈ రెండు ఫీజులను మూడేళ్లుగా నిర్ణయించలేదు. దీంతో ప్రభుత్వానికి Rs 13,205 కోట్ల మేర ఆదాయ నష్టం వాటిల్లింది.
Also read:UP MLC Elections: ఎమ్మెల్సీ స్థానాలపై కన్నేసిన బీజేపీ: రేపు 36 మండలి స్థానాలకు పోలింగ్
మార్చి 2019 వరకు నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకులు, మొబైల్ ఆపరేటర్లు మరియు ఇతర ఏజెన్సీలకు UIDAI ఉచిత ప్రమాణీకరణ సేవను అందించింది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. మార్చి 2019లో, e-KYC లావాదేవీలకు గానూ రూ.20లు మరియు YES/NO ప్రమాణీకరణ కోసం 50 పైసలు ధరను UIDAI నిర్ణయించింది. మార్చి 2019 వరకు, UIDAI 637 కోట్ల E-KYC ప్రమాణీకరణ చేసింది. వీటిలో 598 కోట్ల లావాదేవీలు (94 శాతం) కేవలం టెలికాం, బ్యాంకులకు సంబంధించినవే ఉన్నాయి. ప్రతి ధృవీకరణకు టెలికాం కంపెనీలు మరియు బ్యాంకులు రూ. 20 వసూలు చేసినట్లయితే, 598 కోట్ల లావాదేవీలకు గానూ ప్రభుత్వానికి రూ.11960 కోట్ల ఆదాయం వచ్చేది. అదే సమయంలో 2,491 కోట్ల YES / NO ధృవీకరణలను UIDAI చేసింది. ప్రతి వెరిఫికేషన్‌కు ఫిక్స్‌డ్ ఫీజు 50 పైసలు అయితే, ప్రభుత్వానికి 1245.5 కోట్ల అదనపు ఆదాయం వచ్చేది. అయితే UIDAI చేసిన ఈ తప్పిదంపై RBI లేదా ఆర్థికశాఖ ఎటువంటి నిర్ణయం తీసుకోనుంది అనే విషయం తెలియరాలేదు.
Also read:RBI: అన్ని బ్యాంకులకు కార్డ్ లెస్ ట్రాన్సాక్షన్లకు అనుమతిచ్చిన ఆర్బీఐ