RBI: అన్ని బ్యాంకులకు కార్డ్ లెస్ ట్రాన్సాక్షన్లకు అనుమతిచ్చిన ఆర్బీఐ

ATMల ద్వారా కార్డ్ లెస్ ట్రాన్సాక్షన్లకు అన్ని బ్యాంకులకు అనుమతివ్వాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) శుక్రవారం నిర్ణయించింది. ప్రస్తుతం, ATMల ద్వారా కార్డ్-లెస్ మనీ విత్‌డ్రా అనేది

RBI: అన్ని బ్యాంకులకు కార్డ్ లెస్ ట్రాన్సాక్షన్లకు అనుమతిచ్చిన ఆర్బీఐ

Rbi Cardless

Cardless Cash withdrawal: ATMల ద్వారా కార్డ్ లెస్ ట్రాన్సాక్షన్లకు అన్ని బ్యాంకులకు అనుమతివ్వాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) శుక్రవారం నిర్ణయించింది. ప్రస్తుతం, ATMల ద్వారా కార్డ్-లెస్ మనీ విత్‌డ్రా అనేది దేశంలోని కొన్ని బ్యాంకులు మాత్రమే లావాదేవీలు జరుపుతున్నాయి.

“UPIని ఉపయోగించి అన్ని బ్యాంకులు, ATM నెట్‌వర్క్‌లలో కార్డ్-లెస్ మనీ విత్‌డ్రా సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రతిపాదించాం. ట్రాన్సాక్షన్ల బెనిఫిట్ పెంపొందించడంతో పాటు, అటువంటి లావాదేవీలకు కార్డ్ అవసరం లేకపోవడం వల్ల కార్డ్ లతో జరిపే మోసాలకు అడ్డుకట్ట వేసినట్లవుతుంది. స్కిమ్మింగ్, కార్డ్ క్లోనింగ్ మొదలైన వాటిని నిరోధించగలం” అని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మీటింగ్ లో తెలిపారు.

మోసాలను అరికట్టేందుకు ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. అన్ని బ్యాంకులు కార్డ్-లెస్ మనీ విత్ డ్రా విధానాన్ని అమలు చేశాకే.. ఖాతాదారులు తమ బ్యాంకుల ATMలలో ఉపయోగిస్తారు.

Read Also : ఆర్బీఐ కొత్త ఫ్రేమ్‌వర్క్… ఆఫ్‌లైన్ పేమెంట్లపై రూ. 200 లిమిట్..!

మనీ విత్ డ్రా ట్రాన్సాక్షన్లను ప్రారంభించడానికి కార్డు అవసరం లేకపోవడం వల్ల స్కిమ్మింగ్, కార్డ్ క్లోనింగ్, డివైస్ ట్యాంపరింగ్ వంటి మోసాలను అరికట్టేందుకు సహాయపడుతుందని ఆర్‌బీఐ పేర్కొంది. ATMలలో కేవలం లావాదేవీ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా మాత్రమే జరుగుతుంది.

“అన్ని బ్యాంకులు, అన్ని ATM నెట్‌వర్క్‌లు/ఆపరేటర్‌లలో కార్డ్-లెస్ మనీ విత్ డ్రా సౌకర్యాన్ని ప్రోత్సహించడానికి, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)ని ఉపయోగించడం ద్వారా కస్టమర్ ఆథరైజేషన్‌ను ప్రారంభించాలనే ఉద్దేశ్యంతో ప్రతిపాదించారు. ATM నెట్‌వర్క్‌ల ద్వారా అటువంటి లావాదేవీల సెటిల్మెంట్ జరుగుతుంది.”