UK PM Johnson : భారత్‌కు చేరుకున్న బ్రిటన్ ప్రధాని జాన్సన్.. నేడు గుజరాత్‌లో పర్యటన..!

UK PM Johnson : బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా బోరిస్ జాన్సన్ భారత్ చేరుకున్నారు.

UK PM Johnson : బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా బోరిస్ జాన్సన్ భారత్ చేరుకున్నారు. లండన్ నుంచి బయల్దేరిన ఆయన గురువారం ఉదయం (ఏప్రిల్ 21) గుజరాత్ లోని అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంధ్ర పటేల్, గవర్నర్ ఆచార్య దేవ్‌వ్రత్ యూకే ప్రధానికి సాదారంగా స్వాగతం పలికారు. జాన్సన్ కు పుష్పగుచ్చం ఇచ్చి విషెస్ తెలిపారు. అలాగే, అహ్మదాబాద్ మేయర్, రాష్ట్ర సీఎస్, గుజరాత్ పోలీసు డీజీ ఆశిష్ భాటియా, జిల్లా కలెక్టర్, అహ్మదాబాద్ నగర పోలీసు కమిషనర్ కూడా విమానాశ్రయంలో జాన్సన్ కు ఘన స్వాగతం పలికారు. .

మనదేశంలో ఈరోజు నుంచి రెండు రోజుల పాటు ప్రధాని జాన్సన్ పర్యటించనున్నారు. దేశంలో వ్యాపారం, ప్రధానంగా స్వేచ్ఛా వాణిజ్యం, ఇంధన రంగం, రక్షణ పరంగా అవసరమైన సత్సాంబంధాలను కొనసాగించడంలో భాగంగా యూకే ప్రధాని దేశంలో పర్యటించనున్నారు. మొదటి రోజు తన పర్యటనలో గుజరాత్‌లోనే జాన్సన్ గడపనున్నారు. ఈరోజు రాత్రి భోజనం తర్వాత ఆయన తిరిగి ఢిల్లీకి బయల్దేరనున్నారు. ఇంతకుముందు PM జాన్సన్ భారత్ పర్యటనకు వచ్చేందుకు ప్రయత్నించినా కోవిడ్ కారణంగా పర్యటన రద్దు అయింది. కరోనా ప్రభావం తగ్గడంతో జాన్సన్ భారత్‌లో పర్యటిస్తున్నారు.

యూకే పీఎం తన పర్యటనను అహ్మదాబాద్‌ నుంచి ప్రారంభించనున్నారు. అహ్మదాబాద్‌‌లోని పారిశ్రామిక, వ్యాపారవేత్తలో ముందుగా జాన్సన్ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా భారత్‌- బ్రిటన్‌ వాణిజ్య, ప్రజా సంబంధాలపై చర్చించనున్నారు. పరిశ్రమల్లో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై, వైద్య, శాస్త్ర రంగాలకు సంబంధించి పలు అంశాలపై కూడా ఆయన ప్రకటన చేసే అవకాశం ఉంది.

Uk Pm Boris Johnson Arrives In India For 2 Day Visit, Gujarat Cm Welcomes Him 

శుక్రవారం (ఏప్రిల్ 21)న జాన్సన్‌ ఢిల్లీ చేరుకోనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. రక్షణ విషయాల్లో భాగస్వామ్యం, స్వేచ్ఛా వాణిజ్యం, ఇంధ‌న భ‌ద్రత‌ సహా పలు అంశాలపై ఇరు ప్రధానులు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రష్యా-యుక్రెయిన్‌ యుద్ధం అంశం కూడా ఇరువరి మధ్య ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.

Read Also : UK PM Boris Johnson: ఇండియాకు యూకే ప్రధాని.. మోదీతో చర్చలు

ట్రెండింగ్ వార్తలు