UK PM Boris Johnson: ఇండియాకు యూకే ప్రధాని.. మోదీతో చర్చలు

భారత ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరిపేందుకు గానూ వచ్చే వారం యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ ఇండియాకు రానున్నారు. ఇండో-ఫసిఫిక్ ప్రాంతంలో బోల్‌స్టర్ క్లోజ్ పార్టనర్‌షిప్..

UK PM Boris Johnson: ఇండియాకు యూకే ప్రధాని.. మోదీతో చర్చలు

Johnson Modi

 

 

UK PM Boris Johnson: భారత ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరిపేందుకు గానూ వచ్చే వారం యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ ఇండియాకు రానున్నారు. ఇండో-ఫసిఫిక్ ప్రాంతంలో బోల్‌స్టర్ క్లోజ్ పార్టనర్‌షిప్, సెక్యూరిటీ కోఆపరేషన్ అంశాలపై చర్చించే ఉద్దేశ్యంతో వస్తున్నట్లు సమాచారం.

“గురువారం ఏప్రిల్ 21న అహ్మదాబాద్ కు విచ్చేసి యూకే, ఇండియా మధ్య కమర్షియల్, ట్రేడింగ్, ప్రజల మద్య సత్సంబంధాలు నెలకొల్పేందుకు గానూ చర్చిస్తారు. గుజరాత్ యూకే ప్రధాని రావడం ఇదే తొలిసారి. ఇండియాలో ఐదో పెద్ద రాష్ట్రమైన గుజరాత్ లో సగానికి పైగా బ్రిటీష్ – ఇండియన్ పాపులేషన్ ఉంటున్నారు” అని డౌనింగ్ స్ట్రీట్ స్టేట్మెంట్ విడుదల చేసింది.

గుజరాత్ వేదికగా జాన్సన్ న్యూ సైన్స్, హెల్త్, టెక్నాలజీ ప్రాజెక్టుల గురించి వెచ్చించనున్న ప్రధాన పెట్టుబడులను ప్రకటించనున్నారు.

Read Also: రైతు ఆందోళనలపై పీఎం మోడీతో మాట్లాడమని బోరిస్ జాన్సన్‌ను అడుగుతున్న ఎంపీలు

“ఆ తర్వాత బోరిస్ జాన్సన్ న్యూ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని శుక్రవారం ఏప్రిల్ 22న కలుస్తారు. యూకే, ఇండియాల మధ్య ఉన్న స్ట్రాటజిక్ డిఫెన్స్, డిప్లమోటిక్, ఎకానమిక్ పార్టనర్‌షిప్, ఇండో ఫసిఫిక్ ప్రాంతంలో సెక్యూరిటీ కో ఆపరేషన్ గురించి మాట్లాడతారు” అని వెల్లడించారు.