Rishi Sunak Visit Akshardham Temple
Rishi Sunak Visit Akshardham Temple : ఇంగ్లాండ్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించన తర్వాత రిషి సునాక్ మొదటి సారిగా భారత్ లో పర్యటిస్తున్నారు. జీ20 సమావేశాల్లో పాల్గొనడానికి రిషి సునాక్ భారత్ కు వచ్చారు. ఈ నేపథ్యంలో రిషి సునాక్ సతీ సమేతంగా న్యూఢిల్లీలోని అక్షర్ ధామ్ ఆలయాన్ని సందర్శించారు. భార్య అక్షతా మూర్తితో కలిసి రిషి సునాక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, ఢిల్లీలో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. మరో 2 నుంచి 3 గంటలపాటు తేలికపాటి నుంచి సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
Sunak & Modi: ఒక్క ట్వీట్‌తో భారత్, బ్రిటన్ మధ్య స్నేహాన్ని వెల్లడించిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్