Sunak & Modi: ఒక్క ట్వీట్‭తో భారత్, బ్రిటన్ మధ్య స్నేహాన్ని వెల్లడించిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్

మోదీతో కరచాలనం చేస్తున్న ఫొటోను రిషి సునాక్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. అనంతరం ‘స్నేహంతో ఒక్కటయ్యాం’ అని ఇంగ్లీషులో ‘ఒక బలమైన స్నేహం’ అని హిందీలో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‭లో ఇరు దేశాల జాతీయ జెండాలను మెన్షన్ చేశారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్రమోదీని సైతం మెన్షన్ చేశారు.

Sunak & Modi: ఒక్క ట్వీట్‭తో భారత్, బ్రిటన్ మధ్య స్నేహాన్ని వెల్లడించిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్

UK PM Rishi Sunak tweets in Hindi as he shares pic with PM Modi

Sunak & Modi: బ్రిటన్, ఇండియా దోస్తీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మిగతా అన్ని దేశాలతో పోల్చుకుంటే బ్రిటన్‭తో భారత్‭కు అత్యంత సన్నిహిత, లోతైన సంబంధాలు ఉంటాయి. అందునా భారత సంతతికి చెందిన వ్యక్తి బ్రిటన్ ప్రధానమంత్రి అయ్యారు. ఇక ఇరు దేశాల మధ్య దోస్తీ మరింత ప్రత్యేకంగా ఉంటుంది. ఇది ఎంత ప్రత్యేకంగా ఉంటుందో స్వయంగా బ్రిటన్ ప్రధానమంత్రే రిషి సునాంకే రుజువు చేశారు. దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీని జీ-20 సమ్మిట్‭లో తాను కలిసిన ఫొటోను ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘ఒక బలమైన స్నేహం’ అని హిందీలో ట్వీట్ చేశారు.

మోదీతో కరచాలనం చేస్తున్న ఫొటోను రిషి సునాక్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. అనంతరం ‘స్నేహంతో ఒక్కటయ్యాం’ అని ఇంగ్లీషులో ‘ఒక బలమైన స్నేహం’ అని హిందీలో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‭లో ఇరు దేశాల జాతీయ జెండాలను మెన్షన్ చేశారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్రమోదీని సైతం మెన్షన్ చేశారు. కాగా, ఈ ట్వీట్‭పై భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మోదీకి పెరిగిన ఖ్యాతిని పొగుడుతూనే, ఇండియాతో సంబంధాలపై రిషి సునాక్ వైఖరిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇకపోతే, భారత ప్రధాని నరేంద్ర మోదీతో రిషి సునాక్ భేటీ జరిగిన కొద్దిగంటలకే యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీ సంవత్సరం యూకేలో పనిచేయడానికి భారతదేశం నుండి యువత కోసం వీసాలు అందించే పథకానికి అక్కడి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.  18–30 సంవత్సరాల వయస్సు గల డిగ్రీ విద్యావంతులైన భారతీయులు వృత్తిపరమైన, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడానికి రెండేళ్ల వరకు యూకేలో జీవించడానికి 3వేల మందికి  వీసాలను అందించనున్నారు.  ఈ విషయాన్ని యూకే ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది.

2023 ప్రారంభంలో ఈ పథకం అమల్లోకి వస్తుంది. ఇటువంటి పథకం నుండి ప్రయోజనం పొందిన మొదటి వీసా జాతీయ దేశం భారతదేశం కావటం గమనార్హం. గత సంవత్సరం అంగీకరించిన యూకే ఇండియా మైగ్రేషన్, మొబిలిటీ భాగస్వామ్యం యొక్క సంబంధాన్ని పెంచుతుందని UK ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

Mallikarjun Muthyal: బీజేపీలో చేరడానికి సిద్ధమైన మాజీ జేడీఎస్ నేత దారుణ హత్య.. ఛిద్రమైన రహస్య భాగాలు