Maharashtra : మహారాష్ట్రలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్.. భయంతో జనం పరుగులు

రాష్ట్రంలోని రత్నగిరి జిల్లాలోని చిప్లూన్ నగరంలో మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. చిప్లూన్‌లో ముంబై - గోవా నాలుగు లేన్ల హైవేలో నిర్మాణంలో ఫ్లైఓవర్ స్తంభం కుప్పకూలింది.

Under Construction Flyover Collapse

Maharashtra Flyover Collapse : రోడ్డుపై పాదాచారులు నడుచుకుంటూ వెళ్తున్నారు.. వాహనదారులు ఎవరి దారిలో వారు వెళ్తున్నారు.. అయితే అకస్మాత్తుగా అలజడి నెలకొంది. ఒక్కసారిగా నిర్మాణంలో ఫ్లైఓవర్ కుప్పకూలింది. పట్టపగలు, మిట్ట మధ్యాహ్నం అందరూ చూస్తుండగా ఉన్నట్టుండి కుప్పకూలింది. దీంతో అక్కడున్న వారందరూ ఉలిక్కి పడ్డారు. పాదాచారులు భయంతో పరుగులు తీశారు.

అటుగా వెళ్తున్న వాహనదారులు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ సోమవారం మధ్యాహ్నం రెండుగా విరిగి కుప్పకూలి పోయింది.

Rajasthan : రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం…ఏడుగురి మృతి, 8 మందికి గాయాలు

క్రేన్ మెషీన్ దెబ్బతినడంతోపాటు భారీ ధూళి మేఘాలు ఎగసిపడుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. రాష్ట్రంలోని రత్నగిరి జిల్లాలోని చిప్లూన్ నగరంలో మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. చిప్లూన్‌లో ముంబై – గోవా నాలుగు లేన్ల హైవేలో నిర్మాణంలో ఫ్లైఓవర్ స్తంభం కుప్పకూలింది.

వెంటనే, ఫ్లైఓవర్ ఒక భాగం కూడా కూలిపోయింది. సైట్లో ఉపయోగిస్తున్న క్రేన్ యంత్రం దెబ్బతింది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు లేదా ప్రాణ నష్టం జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు