Rajasthan : రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం…ఏడుగురి మృతి, 8 మందికి గాయాలు

రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్ జిల్లాలో బ్రేక్ ఫెయిల్ కావడంతో ట్రక్కు మల్టీ యుటిలిటీ వెహికల్ పైకి దూసుకెళ్లడంతో ఏడుగురు మృతి చెందగా, 8 మంది గాయపడ్డారు......

Rajasthan : రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం…ఏడుగురి మృతి, 8 మందికి గాయాలు

Road Accident

Updated On : October 16, 2023 / 9:50 AM IST

Rajasthan : రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్ జిల్లాలో బ్రేక్ ఫెయిల్ కావడంతో ట్రక్కు మల్టీ యుటిలిటీ వెహికల్ పైకి దూసుకెళ్లడంతో ఏడుగురు మృతి చెందగా, 8 మంది గాయపడ్డారు. ఢిల్లీ-ముంబయి జాతీయ రహదారిపై రతన్‌పూర్ సరిహద్దు సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసు అధికారి తెలిపారు. మృతదేహాలు రోడ్డుపై పడి ఉన్నాయని, తీవ్రంగా గాయపడిన ముగ్గురిని దుంగార్‌పూర్‌ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసు అధికారి తెలిపారు.

Also Read : Israel-Hamas Conflict Horror : గాజాలో పెరిగిన మృతుల సంఖ్య, ఐస్‌క్రీం ట్రక్కుల్లో మృతదేహాలు

ట్రక్కు బ్రేకులు ఫెయిల్ కావడంతో ఫోర్స్ ట్రాక్స్ క్రూయిజర్- 13 మంది వరకు కూర్చోగలిగే మల్టీ యుటిలిటీ వెహికల్ పైకి దూసుకెళ్లింది. దీని ప్రభావంతో ఎంయూవీ బోల్తా పడిందని పోలీసులు పేర్కొన్నారు. మరణించిన వారిలో నలుగురిని ధనపాల్ (24), హేమంత్ (21), రాకేష్ (25), ముఖేష్ (25)గా గుర్తించారు. మృతుల్లో 14 సంవత్సరాల వయస్సు గల బాలిక, మరో ఇద్దరు ఉన్నారు.

Also Read :  Israel-Hamas Conflict Horror : గాజాలో పెరిగిన మృతుల సంఖ్య, ఐస్‌క్రీం ట్రక్కుల్లో మృతదేహాలు

మృతదేహాలను ఇంకా గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీ నారాయణ్ మంత్రి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కుందన్ కన్వారియా సహా సీనియర్ పోలీసు, పరిపాలన అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

Also Read : India’s borders : భారత సరిహద్దు పోర్టుల్లో రేడియేషన్ డిటెక్షన్ పరికరాలు