India’s borders : భారత సరిహద్దు పోర్టుల్లో రేడియేషన్ డిటెక్షన్ పరికరాలు

Army Radiation detection equipment
India’s borders : భారతదేశ సరిహద్దుల్లోని 8 ల్యాండ్ పోర్టుల్లో రేడియేషన్ డిటెక్షన్ పరికరాలను ఏర్పాటు చేయనున్నారు. రేడియేషన్ డిటెక్షన్ పరికరాలను పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్‌లతో భారతదేశం యొక్క సరిహద్దుల వెంట ఉన్న 8 ల్యాండ్ పోర్ట్‌లలో అమర్చనున్నారు. అణు పరికరాల తయారీలో ఉపయోగించే రేడియోధార్మిక పదార్థాల అక్రమ రవాణాను తనిఖీ చేయడానికి వీటిని ఏర్పాటు చేయనున్నారు.
రేడియో ధార్మిక పదార్థాల అక్రమ రవాణాకు చెక్
ఈ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్‌లు అట్టారీ (పాకిస్తాన్ సరిహద్దు), పెట్రాపోల్, అగర్తలా, దవ్కీ, సుతార్‌కండి (బంగ్లాదేశ్ సరిహద్దు), రాక్సాల్, జోగ్బానీ (నేపాల్), మోరే (మయన్మార్) ల్యాండ్ పోర్ట్‌లలో అమర్చనున్నారు. రేడియేషన్ డిటెక్షన్ పరికరాల ఇన్‌స్టాలేషన్, నిర్వహణ కోసం వర్క్ ఆర్డర్‌ను ప్రభుత్వం గత సంవత్సరం ఇచ్చింది. త్వరలో ఇన్‌స్టాలేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారని ఆర్మీవర్గాలు వెల్లడించాయి.
Also Read : Mahua Moitra : టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై బీజేపీ సంచలన ఆరోపణలు
అంతర్జాతీయ సరిహద్దుల్లో రేడియోధార్మిక పదార్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్‌డీఈని ఏర్పాటు చేసేందుకు చొరవ తీసుకుంది. రేడియోధార్మిక పదార్థాల అక్రమ రవాణా భారత భద్రతా సంస్థలకు సవాలుగా మారిన నేపథ్యంలో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ట్రక్కులు, డ్రైవ్-త్రూ మానిటరింగ్ స్టేషన్‌లో రేడియేషన్ డిటెక్షన్ పరికరాలను ఇన్‌స్టాల్ చేయనున్నారు.
Also Read : Israel-Gaza war : నీటి కొరతతో రోజుల తరబడిగా స్నానం చేయని గాజా వాసులు